పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ శ్రేణులు…

0
718

అంబేద్కర్ విగ్రహం వద్ద భారీ స్థాయిలో ఆందోళన…

తక్షణమే పెంచిన రేట్లు తగ్గించాలని తహసిల్దార్ కు వినతి..


నవతరం, ప్రత్తిపాడు: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై నియోజకవర్గ కేంద్రమైన ప్రత్తిపాడులో నియోజకవర్గ వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గ నలుమూలల నుండి వైసిపి శ్రేణులు ప్రత్తిపాడు చేరుకుని అంబేద్కర్ విగ్రహం వద్ద పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వైసిపి నాయకులు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి ప్రజలపై పెను భారం మోపిందన్నారు. పెట్రోల్,డీజిల్ ధరలు పెంచడం వల్ల రైతులకు వ్యవసాయ ఖర్చులు పెరగడమే కాకుండా, ఆటో, క్యాబ్, లారీ డ్రైవర్ల జీవనోపాధి దెబ్బతింటుందన్నారు. నిత్యవసర వస్తువుల ధరలు పెరగడంతోపాటు, బస్ ఛార్జీలు, రవాణా వ్యయం పెరిగే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ముఖ్యంగా సామాన్య ప్రజల జీవనం మరింత కష్టతరంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తారు. తక్షణమే పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని వైసిపి నాయకులు డిమాండ్ చేసారు. లేనిపక్షంలో భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అనంతరం ఎమ్ఆర్ఓ ఎం సూర్యప్రభకు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బెహరా రాజరాజేశ్వరి దొరబాబు, గొల్లు చిన దివాణం, గుడాల వెంకటరత్నం, గొల్లపల్లి కాశీ విశ్వనాథ్, శిగడం వెంకటేశ్వరరావు, గొల్లపల్లి సురేష్, గౌతు స్వామి, శేరు కృష్ణ, నరాల శ్రీను,చింతకాయల, సత్యన్నారాయణ, బంకు శ్రీను, పినిశెట్టి ప్రకాష్, సామంతుల సూర్య కుమార్, చిలకమర్తి వెంకటరమణ, బొడ్డు సూరిబాబు, నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here