


మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం.
ప్రభుత్వం అండగా ఉంటుందని బాధితులకు భరోసా ఇచ్చిన సీఎం.
స్థానిక అధికారుల నిర్లక్ష్యంపై సీఎం సీరియస్. నలుగురు అధికారులను సస్పెండ్ చేస్తున్నట్టు వెల్లడించిన ముఖ్యమంత్రి.
బాణసంచా ఘటన చాలా దురదృష్టకరం. హదయ విచారకర ఘటన.


నవతరం, సామర్లకోట: ఇప్పటి వరకు 23 మంది చనిపోగా, 6 మంది పరిస్థితి విషమంగా ఉంది… ఇద్దరికి ప్రమాదం తప్పింది. ఇందులో 12 మంది ఎస్సీలు, 9 మంది మహిళలు బాధితుల్లో ఉన్నారు. కూలీ పని కోసం వెల్లి పూటగడవడం కోసం వెళ్లారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ… జరిగిన ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుంది. ఇటీవలే ఒక సంఘటన జరిగింది.. దాని తర్వాత ఇది రెండో ఘటన. రాబోయే రోజుల్లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. ఈ ఘటనపై విచారణ చేసి బాధ్యతను ఫిక్స్ చేస్తాం. ఆర్డీఓ, డీఎస్పీ, డిస్టిక్ లేబర్ ఆఫీసర్, ఫైర్ ఆఫీసర్ ను సస్పెండ్ చేస్తున్నాం. విచారణ అనంతరం సంబంధిత అధికారులపైనా చర్యలు తీసుకుంటాం. కొందరు విచ్చలవిడి తనానికి అలవాటు పడి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు… వారిని అరెస్ట్ చెయ్యడమే కాకుండా ప్రాసిక్యూషన్ చేస్తాం. వాళ్ల ఆస్తులు జప్తు చేసి బాధితులకు అప్పగిస్తాం. ఇష్ట ప్రకారం చేయడానికి వీళ్లేదు. ప్రభుత్వ పరంగా ఒక్కో కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక సాయం చేస్తాం. కేంద్రం రూ.2 లక్షలు తీవ్రంగా గాయపడిన 50 వేలు చొప్పున ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం తరుపున అన్ని విధాలుగా వారిని కూడా ఆదుకుంటాం. చిన్న పిల్లలు ఉంటే వారి చదువు బాధ్యత పూర్తిగా ప్రభుత్వం చూసుకుంటుంది. రెసిడెన్సియల్ స్కూళ్లలో చదివిస్తాం. ఇళ్లు లేని వారికి ఇళ్లు నిర్మిస్తాం. చనిపోయిన వారిని తీసుకురాలేము… కానీ వారి కుటుంబాలను ఆదుకుంటాం. మృతి చెందిన వారి ఆత్మ శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. అనుమతులు వచ్చాక మనుషులను నియమించుకున్నారు తప్ప జాగ్రత్తలు తీసుకోలేదు. ఎక్స్ ప్లోజివ్ మెటీరియల్ ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదు. ఎన్ని బాణసంచా కేంద్రాలు ఉన్నాయో సమాచారం తీసుకుంటాం. ఉన్న ప్రొసీజర్స్ కూడా సరిపోవడం లేదు. ఈ ప్రాంతాలంతా సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేసి కంట్రోల్ రూములకు అనుసంధానిస్తాం. బాణసంచా కేంద్రాలకు అనుమతులు కఠినతరం చేస్తాం. .

