

సింహాద్రి అప్పన్న సన్నిధిలో జననేత జన్మదినోత్సవం వేడుకలు ….!..
కుటుంబ సమేతంగా పాల్గొన్న చిన్న శ్రీను గారు కుమార్తె సిరమ్మ ….!..
381 గ్రాముల బంగారంతో కూడిన పగడాల హారాన్ని స్వామి వారికి సమర్పించి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేరు మీద ప్రత్యేక పూజలు ఆనందంలో వై.యస్.ఆర్.సి.పి కార్యకర్తలు అంబరాన్ని అంటిన సంబరాలు.
నవతరం, భీమిలి: సింహాచలంలో వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు భీమిలి నియోజకవర్గం, సింహాచలం అప్పన్న సన్నిధిలో ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వై.యస్.ఆర్.సీపి జిల్లా అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గం సమన్వయ కర్త మజ్జి శ్రీనివాస రావు (చిన్న శ్రీను), సతీమణి మజ్జి పుష్పాంజలి, అల్లుడు నెల్లిమర్ల నియోజకవర్గం వై.యస్.ఆర్.సీపి.యువజన విభాగం అధ్యక్షుడు ప్రదీప్ నాయుడు, కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ ఆదివారం సింహాద్రి అప్పన్నను దర్శించి అనంతరం స్వామి వారికి 381 గ్రాముల బంగారంతో కూడిన పగడాల హారం, పట్టువస్త్రాలు కుటుంబ సమేతంగా
సమర్పింఛి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అంతకు ముందే వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అనంతరం వారి ఆశీర్వాదం పొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండే రాష్ట్రాన్ని ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలన అస్తవ్యస్థంగా ఉందన్నారు. మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని త్వరలోనే మంచి రోజులు వస్తాయన్నారు. కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గ పరిధిలో ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు స్థానిక ముఖ్య నాయకులు, వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు .

