
అరకు పార్లమెంట్ అధ్యక్షురాలిగా అవకాశం కల్పించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు…..!..మోజూరు తేజావతి…!..:
నవతరం: అరకు: అరకు పార్లమెంట్ అధ్యక్షురాలిగా నన్ను నియమించినందుకు తెలుగుదేశం పార్టీ అధినాయకత్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని మోజూరు తేజావతి తెలిపారు…..!.. జ్ఞానాన్ని బోధించే ఉపాధ్యాయ వృత్తి నుండి, సమాజ దిశను మార్చే ప్రజా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నాకు, తెలుగుదేశం పార్టీ ఈరోజు ఒక గొప్ప బాధ్యతను అప్పగించిందన్నారు. నాపై నమ్మకం ఉంచి ఈ కీలక బాధ్యతను అప్పగించిన పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్, పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ అచ్చం నాయుడుతో పాటు ఇతర ముఖ్య నేతలకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయ వృత్తిలో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన తాను, ఇప్పుడు సమాజంలోని ప్రతి పౌరుడి భవిష్యత్తు కోసం, ముఖ్యంగా అరకు పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తానని తెలిపారు. ఉపాధ్యాయ వృత్తి నేర్పిన క్రమశిక్షణ, నిబద్ధతలను రాజకీయ జీవితంలోనూ పాటిస్తానని స్పష్టం చేశారు.తనకు అండగా నిలుస్తున్న పార్టీ కార్యకర్తలకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, నన్ను తమలో ఒకరిగా స్వీకరించి, మద్దతుగా నిలుస్తున్న తెలుగు తమ్ముళ్ల సహకారంతో పార్టీని మరింత బలోపేతం చేస్తానన్నారు.ప్రజల సమస్యలే తన అజెండా అని, సామాన్యుడి గొంతుకగా పార్లమెంట్ స్థాయిలో సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతానని తెలిపారు. డబుల్ ఇంజన్ సర్కార్లో కీలకమైన ప్రాంతీయ సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు మరియు రాజకీయాలకతీతంగా పార్లమెంట్ పరిధిలోనే కాకుండా ఈ ప్రాంతంలోని ఉన్న అన్ని సమస్యల మీద తనదైన శైలిలో ప్రయత్నించేందుకు కృషి చేస్తానని ఆమె తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను ఇంటింటికీ తీసుకెళ్లే బాధ్యతను పూర్తి అంకితభావంతో నిర్వర్తిస్తానన్నారు. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ, రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగురవేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని తెలిపారు. ఈ సందర్భంగా అనకాపల్లి పర్యటనకు వచ్చిన పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తనయుడు కలిసి, పార్టీ తనకు అప్పగించిన బాధ్యతను అత్యంత విశ్వసనీయంగా, నిబద్ధతతో నిర్వర్తిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. వ్యక్తిగత స్వార్థం లేకుండా వ్యవస్థ ప్రయోజనాల కోసం పనిచేస్తూ, పార్టీ నాయకత్వానికి మరియు ప్రజలకు జవాబుదారీగా ఉంటానని మోజూరు తేజావతి ఈ ప్రకటనలో పేర్కొన్నారు.

