

గ్రామీణ పేదల జీవనోపాధిలో కీలక పాత్ర పోషిస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ దాని స్థానంలో ‘విబి-జిరామ్ జి’ పేరుతో తీసుకువచ్చిన బిల్లును ఉపసంహరించాలి ……!..సిపిఎం జిల్లా కార్యదర్శి డి. గోవిందరావు డిమాండ్……!.. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ కేంద్రం చేస్తున్న సవరణలకు నిరసనగా శుక్రవారం సిపిఎం ఆధ్వర్యంలో శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం గాంధీ విగ్రహాం వద్ద నిరసన తెలిపారు……!.. నవతరం, శ్రీకాకుళం: ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చట్టబద్ధ హక్కుగా ఉన్న ఈ పథకాన్ని రద్దు చేసేందుకు కేంద్రం చేస్తున్న కుట్రలను సిపిఐ (యం) తీవ్రంగా ఖండిస్తున్నదని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం తెస్తున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అండ్ అజీవిక మిషన్ (విబి-జి రాం జి) పేరుతో ఉపాధిహామీ చట్టనికి “రాంరాం” పలకనున్నారని అన్నారు. పని హక్కుగా ఉన్న పాత చట్టాన్ని మార్చి ఇదొక సాధారణ పథకంగా అమలు చేయనున్నారు. ఇప్పటి వరకు వ్యవసాయ కార్మికులకు డిమాండును బట్టి ఉపాధి కల్పించే విధానాన్ని మార్చివేసి అవసరాన్ని బట్టి పనులు పెట్టడం అంటే ఈ పథకం మౌలిక స్వభావాన్ని నిర్వీర్యం చేయడమే. మోడీ ప్రభుత్వం ఈ పథకంలోని మహాత్మా గాంధీ పేరును తొలగించి ద్రోహం చేస్తుందని అన్నారు. ఉపాధి హామీ పథకం అమలులో కీలకమైన రాష్ట్రాల భాగస్వామ్యం కొత్త బిల్లు వల్ల నామమాత్రంగా మారుతుంది. మరోవైపు 10 నుండి 40 శాతానికి రాష్ట్రాలపై భారం పెంచారు. ఇప్పటికే యంత్రాలు కేటాయించి కూలీల డిమాండ్ తగ్గించారు. వ్యవసాయ పనుల పేరుతో 60 రోజుల ఉపాధిని సస్పెండ్ చేసి ఈ పథకాన్ని రైతులకు పోటీగా మారుస్తుందని విమర్శించారు.ఈ పథకం అమలుకు ఇప్పటి వరకు కేంద్రం ఇస్తున్న 90% నిధులను 60 శాతానికి తగ్గించి రాష్ట్రాలపై వేల కోట్ల అదనపు భారం వేస్తున్నారు. మన రాష్ట్రంపై ఏటా సుమారు నాలుగు వేల కోట్లు అదనపు భారం పడనుంది. ఇప్పటికే లక్షల కోట్లు అప్పుల్లో వున్న రాష్ట్రం ఈ అదనపు భారాన్ని ఎలా భరించగలదు? మోడీ ప్రభుత్వానికి కీలక మద్దతు గా వున్న తెలుగుదేశం, జనసేన పార్టీలు కొత్త ఉపాధి బిల్లును ఉపసంహరించుకునేటట్లు కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. మన రాష్ట్రానికి చెందిన అన్ని పార్టీల ఎంపీలు పార్లమెంటులో దీన్ని వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోనారి మోహనరావు, గంగరాపు సింహాచలం మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే కుట్రలకు వ్యతిరేకంగా ఉద్యమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు, డిసెంబర్ 22వ తేదీన వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు పోలాకి ప్రసాదు, యం . గోవర్ధన రావు, ఆర్ ప్రకాష్, ఎ లక్ష్మి, మహేష్ ఎం లలిత, అల్లు సోమశేఖర్, చందు, నగేష్ తదితరులు పాల్గొన్నారు.

