మండలంలో జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ….

0
330
నవతరం,రౌతులపూడి: సీఎం వైఎస్ జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ మండలంలో ఉన్న అన్ని పాఠశాలలో ఉపాధ్యాయులు, ప్రజా ప్రతినిధులు పంపిణీ ప్రారంభించారు. మండలంలోని రౌతులపూడి, ఎస్ అగ్రహారం బలరామపురం గ్రామాలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జగనన్న విద్యా కానుక కిట్లను మండల అభివృద్ధి అధికారి ఎస్వి నాయుడు ఆయా గ్రామాల సర్పంచులు మరియు ప్రజా ప్రతినిధులు విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా రౌతులపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన సమావేశంలో వైసీపీ జెడ్పిటిసి అభ్యర్థి గొల్లు చిన్న దివాణం మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం చేయనంతగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యా ప్రతీ ఒక్కరికీ అందాలనే ఉద్దేశంతో విద్యా వ్యవస్థను ఎంతగానో అభివృద్ధి చేస్తున్నారని విద్యార్థుల అభ్యున్నతికి జగన్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని, అమ్మ ఒడి, ఫీజు రియంబర్స్మెంట్, జగనన్న విద్యా దీవెన వంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నప్పుడు విద్యార్థులు ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకునే విధంగా వారి తల్లిదండ్రులు పిల్లలను తీర్చి దిద్దాలని అలాగే జగనన్న అందజేస్తున్న టెక్స్ట్ బుక్, నోట్ బుక్స్, షూస్, బ్యాగ్, ఇంగ్లీష్ డిక్షనరీ వంటివి ఇస్తునప్పుడు వీటంన్నింటినీ విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. అలాగే ప్రభుత్వం ఎన్ని సదుపాయాలు కల్పించినప్పటికీ విద్యార్థులకు కావలసినటువంటిది మంచి చదువు అందించాలి ఆ బాధ్యత ఉపాధ్యాయుల పైనే ఉందని గనుక ఉపాధ్యాయులు చక్కగా బోధించాలని విజ్ఞప్తి చేశారు. రౌతులపూడి ఉప సర్పంచ్ వాసిరెడ్డి భాస్కరబాబు మాట్లాడుతూ మేము చదువుకునే రోజులలో చాలా దూరం వెళ్ళవలసి వచ్చేదని, అంతేకాక తాటాకు పాకాలలో కనీస సదుపాయాలు లేని స్థితిలో మేము చదువుకున్నాము. కానీ వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులను కల్పించనున్నారు. గతంలో విద్యా సంవత్సరం కొంత గడిచినా కూడా పుస్తకాలు ఉండేవి కావని ప్రస్తుతం విద్యా సంవత్సరం మొదట్లోనే విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు సమకూర్చడం జరిగిందన్నారు. భవిష్యత్తులో విద్యా వ్యవస్థ ఇంకా అభివృద్ధి చెందాలంటే మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ మళ్లీ రావాలని మరియు శాసనసభ్యులుగా పర్వత శ్రీ పూర్ణ చంద్ర ప్రసాద్ గారే ఉండాలన్నారు. ప్రధానోపాధ్యాయులు గాడి కొండబాబు, ఉపాధ్యాయులు కోరుప్రోలు రాము, సిబ్బంది మరియు రౌతులపూడి గ్రామ సర్పంచ్ కటారి అచ్చమ్మ, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ జిగిరెడ్డి గోవిందు, డిసిసిబి డైరెక్టర్ పులి మధు, గుమ్మరేగుల సర్పంచ్ రాపర్తి రామకృష్ణ, అన్నవరం దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ కమిటీ మెంబర్ వాసిరెడ్డి జమీలు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
ఏదిఏమైనా ఇలాంటి నాన్యమైన విధ్యను అందించడం విదేశాల్లో ఉండేదని వార్తల్లో వినేవాళ్ళం కానీ ఇప్పుడు మనం కళ్ళ ముందే మన గ్రామంలోనే చూస్తున్నాము.