ఆగ్రహం వ్యక్తం చేసిన కుత్బుల్లాపూర్ టీఆర్ఎస్(బీఆర్ఎస్) శ్రేణులు
కుత్బుల్లాపూర్ / మేడ్చల్ (నవతరం): అధికార దాహంతో, ధన బలంతో రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ మహారాష్ట్ర, కర్ణాటక వివిధ రాష్ట్రాలలో ప్రాంతీయ ప్రభుత్వాలను నిర్వీర్యం చేసినట్లు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎమ్మెల్యేలను డబ్బు ఎర చూపి కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన బిజేపి దుష్ట వైఖరిని నిరసిస్తూ టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరుకు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ సూచనలతో గాజులరామారం డివిజిన్ పరిదిలోని ఉషముళ్ళపూడి చౌరస్తాలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రషీద్ బేగ్, శ్రీనివాస్ యాదవ్, కమలాకర్, హుస్సేన్, ఇబ్రహీం, ఇమ్రాన్, చందు, మూస ఖాన్, మహేష్, రౌఫ్ తదితరులు.. బీజేపీ పార్టీ దిష్టి బొమ్మ తగులపెట్టి నిరసన తెలిపారు.








