

నవతరం, కాకినాడ: కాకినాడ సబ్ డివిజన్ పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు ముద్దాయిలు అరెస్ట్ చేసి 29 బైక్ లను రికవరీ చేసినట్లు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణ లో పార్కింగ్ చేసిన బైక్ లానే లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారని, సుమారు 14 లక్షల 50 వేల రూపాయల విలువైన బైక్ లను రికవరీ చేసి వాహనాల యజమానులకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. ఈ దొంగతనాల కేసులను చేధించటంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ బృందాన్ని ఎస్పీ బిందు మాధవ్ అభినందించారు.

