1/70 చట్టంకు తూట్లు – యధావిధిగా అక్రమ నిర్మాణాలు…..,,!..

0
128


1/70 చట్టం కాపాడాలంటే పి ఓ గారు రంగంలోకి దిగాలి….!.. అల్లూరి జిల్లా హుకుంపేట ప్రధాన కేంద్రంలో అక్రమ కట్టడాలకు ప్రోత్సహిస్తూ 1/70 చట్టం వ్యతిరేకిస్తూ గిరిజ నేతలకు కొమ్ముకాస్తున్నది అధికారులు….అనే చర్చనేడు తారా స్థాయికి చేరింది. ఇది కేవలం చర్చలు మాత్రమే కాదు నిజమనే అంటున్నారు….!.. హెచ్చరిక బోర్డులువీళ్లే పెడతారు….!..

నవతరం, హుకుంపేట(అల్లూరి జిల్లా): నిర్మాణాలు యధావిధిగా జరుగుతున్న సంబంధిత అధికారులు నిద్ర పోతుంటారు. ఇది హుకుంపేట మండల కేంద్రంలో 1/70 చట్టం కాపాడే అధికారుల తీరు. అసలు హుకుంపేట ప్రధాన కేంద్రం అక్రమ కట్టడాలు కడుతున్నారు అనేది పేపర్లో వస్తేనే తప్ప అధికారులు దీనిపై దృష్టి సారించరు అది కూడా హుకుంపేట అధికారులు ఎప్పుడూ దృష్టి సారించారు. పత్రికలు, మీడియాలో వచ్చిన కథనాలు జిల్లా అధికారులు చూసి వారు స్పందించి సంబంధిత అధికారులకు తెలియజేస్తే అప్పుడు వీళ్ళు పరుగులు పెడతారు. తక్షణమే హెచ్చరిక బోర్డులు పెట్టి మేము నిలిపివేసాము ఆదివాసీల హక్కులు చట్టాలు కాపాడము బాబూ అని ఫోటోలు తీసి పెడతారు. బోర్డులు పెట్టిన కొన్ని రోజుల తర్వాత యధావిధిగా నిర్మాణాలు జరుగుతాయి. జరగడం కాదు ఇప్పుడు మళ్ళీ ఎలా విధిగా నిర్మాణాలు జరుగుతున్నాయి మరిహెచ్చరిక బోర్టులు పెట్టినప్పటికీ కడుతున్నారంటే ఆదివాసీల హక్కులు చట్టాలు ఉల్లంఘించినట్లే, మరోవైపు అధికారులు బోర్డులు పెట్టిన వాటిని తొలగించి నిర్మాణాలు చేపడుతున్నారంటే అది చట్ట వ్యతిరేకం మరి ఇన్ని చేస్తూ నగరం నడిబొడ్డున అక్కడ నిర్మాణాలు చేపడుతున్న అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. దీన్ని బట్టి చూస్తే సంబంధిత అధికారులే ఆదివాసులు హక్కులు, చట్టాలు తుంగ్గలోకి తొక్కుతున్నారు. అనేది నేరుగా కనిపిస్తుంది. సంబంధిత అధికారులు విధినిర్వహణలో ఎంత నిర్లక్ష్యధోరణిగా వ్యవహరిస్తూ ఉన్నారంటే సాక్షాత్తు ఐటీడి పీఓ అక్రమ నిర్మాణాలు తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసిన తరుణంలో హెచ్చరిక బోర్డులు పెట్టిన యధావిధిగా నిర్మాణాలు జరుగుతున్నాయంటే అధికారులకు తెలియకుండా ఇది జరుగుతుందా అనేది వారి విధేయతకే వదిలేయాలి. హుకుంపేట ప్రధాన కేంద్రంలో అక్రమ నిర్మాణాలు పిఓ నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసిన యధావిధిగా నిర్మాణాలు జరుగుతున్న భవనాలుపై ఫోటోలు చూస్తే నేరుగా కనిపిస్తుంది ఈ అక్రమ నిర్మాణాలు సంబంధిత అధికారులు ఎలాగా గుర్తించరు చర్యలు తీసుకోరు కనుక ఇప్పటికైనా ఐటీడీఏ పీవో స్పందించి ఆదేశాలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటారా లేదా వేచి చూడాల్సిందే. ఒకటైతే వాస్తవం ఆదివాసీల హక్కులు చట్టాలు ఉల్లంగిస్తూ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని పలు పత్రికల్లో మీడియాలో కథనాలు రాగానే పిఓ స్పందించి హెచ్చరిక బోర్డులు కూడా పెట్టమని ఆదేశాలు జారీ చేయడం నిజంగా సంతోషకరమైన విషయం అనే చెప్పాలి. బాధాకరమైన విషయం ఏమిటంటే ఐఏఎస్ అధికారులు స్పందించి నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసిన యధావిధిగా నిర్మాణాలు జరుగుతున్న సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమని చెప్పాలి. ఎట్టకేలకు ఆదివాసీల హక్కులు చట్టాలు గౌరవించిన పిఓ స్పందించి హెచ్చరిక బోర్డులు పెట్టించిన సంబంధిత అధికారులు ఆదివాసీల హక్కులు చట్టాలు తుంగ్గలోకి తొక్కుతున్నారు. అనే కోణంపై హెచ్చరిక బోర్డులు పెట్టిన కడుతున్న వారిపై నిర్లక్ష్యధోరణిగా వ్యవహరిస్తున్న అధికారులపై నేరుగా జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసేందుకు పలు గిరిజన సంఘాలు రంగం సిద్ధం చేశారు. అర్థం కాని విషయం ఏమిటంటే వన్ బై సెవెంటీ చట్టం కాపాడే విషయంలో అధికారులు ఎందుకింత నిర్లక్ష్యధోరణిగా వ్యవహరిస్తున్నారు అనే దానిపై ఆదేశాలు జారీ చేసిన అధికారి దృష్టి సారించిచర్యలు తీసుకోకపోవడం నేడు చర్చా నీయసంగా మారింది. ఈ నేపథ్యంలో సాక్షాత్తు జిల్లా ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ మరియు కలెక్టర్ అయినా జిల్లా కలెక్టర్ స్పందించి యధేచ్చగా అక్కడ జరుగుతున్న అక్రమ కట్టడాలు 1/70 ఆదివాసీల హక్కుల పరిరక్షణకు తగు చర్యలు తీసుకోవాలి. ఆశిద్దాం ఆదివాసీల హక్కుల కోసం ప్రభుత్వం న్యాయమైన నిర్ణయాలు తీసుకొని వారి హక్కుల సంరక్షిస్తుందని.