శ్రీదేవి ఆఖరి ఫోటో

0
561

పెళ్లి వేడుక‌కు హాజ‌ర‌య్యారు. ఆహ్వానితులు, అతిథుల‌తో మ‌మేక‌మ‌య్యారు. త‌న చిరున‌వ్వుతో ఆ వేడుక‌కే కొత్త క‌ళ తెచ్చిపెట్టారు. భ‌ర్త బోనీక‌పూర్‌, చిన్న‌కుమార్తె ఖుషీక‌పూర్ దుబాయ్‌కి వెళ్లిన శ్రీదేవి గుండెపోటుతో ఊపిరి ఆగిపోయి నిర్జీవ‌దేహంలా తిరిగొస్తున్నారు.

నటి సోనమ్ కపూర్ కజిన్ మెహితా మార్వా వివాహం కోసం కుటుంబ సభ్యులతో దుబాయ్ వెళ్లారు శ్రీదేవి. వధూవరులతో, తన కుటుంబ సభ్యులతో ఫోటోలు దిగిన శ్రీదేవి వాటిని ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నారు. ఇంతలోనే మృత్యువు ఆమెని కబళించడాన్ని కపూర్ ఫ్యామిలీ జీర్ణించుకోలేక పోతోంది.

ఎంత సెలబ్రెటీలైనా హీరోయిన్ల‌కూ కుటుంబం ఉంటుంది. వారు బంధాలు, అనుబంధాలకు అతీతులేం కారు. దక్షిణాది నుంచి వెళ్లి బాలీవుడ్‌ని ఏలిన శ్రీదేవి ఆ తర్వాత గృహిణిగా పరిపూర్ణ వైవాహిక జీవితాన్ని అనుభవించారు. ఇద్దరు ఆడపిల్లలకు తల్లయ్యారు. తన నట వారసురాలిని వెండితెరపై చూసుకునే స‌మ‌యంలో తిరిగిరాని లోకాల‌కు చేరిపోయారు.