

నవతరం, కాకినాడ: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందిస్తున్న పేదల బియ్యాన్ని కొందరు పలుకుబడి ఉన్న నాయకుల అండదండలతో పక్క దారి పట్టిస్తూనే ఉన్నారు. డీలర్ల వ్యవస్థ పునః ప్రారంభించిన తర్వాత డీలర్లు సంపాదనే ద్యేయంగా బియ్యాన్ని దోచేస్తున్నారు. కొవ్వాడ గ్రామంలో గతంలో రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడిగా చేసిన నాయకుడి అండదండలతో రేషన్ డీలర్ చేస్తున్న అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. కాకినాడ రూరల్ మండలం కొవ్వాడ గ్రామంలో రేషన్ డిపో నెంబర్ 0423036 గల డీలర్ కాళ్ల అపరంజిని కార్డ్ దారులకు ఇవ్వవలసిన రేషన్ బియ్యాన్ని పక్క దోవ పట్టిస్తున్నారు అని స్థానికులు ఆరోపించారు. ప్రతి రేషన్ లబ్ధిదారులకు రేషన్ తీసుకునే సమయంలో ఒక కిలో తక్కువ వచ్చేదని ఇది ఏంటి అని ప్రశ్నించిన వారిపై డీలర్ అపరంజిని ఆమె భర్త వైసిపి నాయకుడు కాళ్ల లక్ష్మణ్ గొడవ పడేవారని ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకొండి అని సమాధానం చెప్పేవారని గ్రామానికి చెందిన స్థానికులు సివిల్ సప్లై అధికారి వీరస్వామి దృష్టికి తీసుకువచ్చారు. స్థానికులు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన డీలర్ భర్త కాళ్ల లక్ష్మణ్ అతనికి సహాయ సహకారాలు అందిస్తున్న ఆ నాయకుడి వ్యవహారం బయటకు రాకుండా చూసుకునే వారు. స్థానికులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో ఎట్టకేలకు అధికారులు స్పందించి తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. ఈ తనిఖీల్లో రేషన్ డీలర్ వద్ద ఉండాల్సిన స్టాక్ కన్నా 350 కిలోలు తక్కువగా ఉండడంతో ఎంఎస్ఓ వీరస్వామి డీలర్ పై 6A కేసు నమోదు చేశారు. సివిల్ సప్లై అధికారి తనిఖీలు చేస్తున్న సమయంలో సదరు అండదండలు అందిసున్న నాయకుడు కోటిపల్లి శ్రీనివాస్ అక్కడకు వచ్చి ఎంఎస్ఓ తో బేరసారాలు చేశారు. ఈ ఏడాది సంక్రాంతి పండుగ నేపధ్యంలో ఈ రేషన్ డీలర్ భర్త కాళ్ల లక్ష్మణ్ వైసిపి పార్టీ నాయకులతో కలసి కోటిపల్లి శ్రీనివాస్ ఫోటో తో ఫ్లెక్సీ ఏర్పాటు చేసి గ్రామంలో ప్రదర్శన చేయడంతో గ్రామంలో జనసేన నాయకులు ఒక్కసారిగా అవ్వకయ్యారు. 2024 ఎన్నికల ముందు వైసీపీ పార్టీ విడి జనసేన గూటికి చేరిన కోటిపల్లి శ్రీనివాస్ జనసేనలో కొనసాగుతూ వైసీపీ వారికి అండదండలు అందిస్తున్నారాని బహిరంగగానే జనసేన నాయకులు మలగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. ఏదేమైనా రానున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఇటువంటి కోవర్టు నాయకులకు చెక్ పెట్టకపోతే పార్టీ తీవ్రంగా నష్ట పోతుందని, స్థానిక జనసేన శాసనసభ్యులు పంతం నానాజీ ఇతగాడి వ్యవహార శైలికి అడ్డుకట్ట వేసి గ్రామంలో పార్టీ క్యాడర్ ను కాపాడుకుంటారో లేదో వేచి చూడాలి అని అనుకుంటున్నట్లు సమాచారం.

