
నవతరం బ్యూరో, శ్రీకాకుళం: నాటి నేటి ప్రభుత్వ విధానాలు ప్రకారం జిల్లాల పునర్విభజనలో భాగముగా శ్రీకాకుళం జిల్లాలో గతంలో ప్రకటించిన మాదిరిగా పలాస కేంద్రముగా జిల్లాకు ఖరారు చేసి న్యాయం చేయండి…..! టెక్కలి, పలాస, ఇర్చాపురం, పాతపట్నం, నాలుగు నియోజకవర్గాలను కలిపి పరిస్థితులకు అనుగుణంగా జిల్లా కేంద్రం ఏదైన జిల్లా ఏర్పాటు మాత్రం న్యాయమైనది అనివర్యమైనది……! శ్రీకాకుళానికి 145 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒరిస్సాకు అనుకొని పూర్తి నిర్లక్ష్యానికి గురైన ఇచ్ఛాపురం శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి వచ్చేందుకు ఉన్న ఇబ్బందులు పాలకులకు తెలియనిది కాదు ……!.. ఈ నాలుగు నియోజకవర్గాల తో కూడుకున్న జిల్లాకు జిల్లా కేంద్రం ఏది అన్నది ప్రధానమైన సమస్య కానే కాదు, ప్రభుత్వానికి అతి తక్కువ ఖర్చుతో నాలుగు నియోజకవర్గాలలోను కూడా జిల్లా అధికార యంత్రాంగానికి వివిధ నియోజకవర్గాలలో ఒక్కొక్క అధికారి కార్యాలయం ఏర్పాటు వలన కూడా ప్రజలకు మరింత మెరుగైన సేవలందించేందుకు దోహదపడతాయి. ప్రభుత్వము 13 జిల్లాల నుండి నేడు 28 జిల్లాలుగా ప్రకటించినట్లు తెలుస్తున్న నేపథ్యంలో అత్యంత వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాకు గత ప్రతిపాదనను అమలు చేయకుండా ఇటీవల క్యాబినెట్ సమావేశంలో పలాస జిల్లా ప్రతిపాదన రాకపోవడం ఈ నాలుగు నియోజకవర్గాల ప్రజలకు ఆందోళనకు ఆవేదనకు గురిచేస్తుంది. ప్రభుత్వం పున పరిశీలన చేసి ప్రాంతీయ అసమానతలకు తావులేని విధముగా నూతన జిల్లాల ఏర్పాటులో పూర్తిగా వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాకు పైన పేర్కొన్న నాలుగు నియోజకవర్గాలను కలుపుకొని పలాస లేక టెక్కలి ఏదైనా సరే జిల్లా కేంద్రం ఏది అన్నది ఇక్కడ ప్రధాన సమస్య కానేకాదు. కానీ నూతన ప్రభుత్వ విధానాలలో భాగముగా కొత్త జిల్లాల ఏర్పాటులో శ్రీకాకుళం జిల్లాను కూడా పరిగణలోకి తీసుకొని సుదీర్ఘ ప్రాంతముగా ఉన్నటువంటి జిల్లా పరిధి ఆ నాలుగు నియోజకవర్గాలకు ఇబ్బందికర పరిణామాలు ఉన్నవి. అనుటకు అతిశయోక్తి లేదు . దీనిని పరిగణలోకి తీసుకొని నూతన జిల్లాను ప్రభుత్వం తక్షణమే ప్రకటించి అది జిల్లా కేంద్రం ఫలాస లేదా టెక్కలి అన్నది సమస్య కానే కాదు, ప్రభుత్వ పరిశీలకుల పరిస్థితులు అధ్యయనం చేసి ఈ రెండు ప్రాంతాలలో ఎక్కుడైనా సరే జిల్లా కేంద్రాన్ని మాత్రం ఏర్పాటు చేయడం అనివార్యము అన్నది మాత్రం నాలుగు నియోజకవర్గాల ప్రజల ఏక అభిప్రాయం. దీనిని శ్రీ ప్రభుత్వం వారు పరిశీలన చేసి న్యాయం చేయవలసిన ఆవశ్యకత ప్రజా ప్రభుత్వంపై ఉన్నది అని అన్ని వర్గాల నుండి అభిప్రాయాలు వ్యక్తమౌతున్నవి. ఈ విధానంపై రాజకీయాలకు అతీతంగా ప్రజల మనోవిష్ఠానికి పరిస్థితులు. పరిపాలన సౌలభ్యానికి అనుకూలమైన నిర్ణయం తీసుకోవలసిన బాధ్యత ఉంది అని ప్రభుత్వం గుర్తించాలి. ఈ ప్రాంతాలలో ప్రభుత్వ భూములు పారిశ్రామిక అభివృద్దికి తోడ్పడే విధముగా ఉండేందుకు అనువైనవి లేకపోలేదు. అదేవిధంగా మానవ వనరులు పుష్కలంగా ఉన్నవి. ఈ ప్రాంత వాసులు దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా పొట్టు పట్టుకొని వెళ్లే పరిస్థితులు విధితమే అటువంటి స్థానిక మానవ మనరులును ఉపయోగించుకొని కార్మికులకు ఉపాధి కల్పించే కొన్ని పరిశ్రమలను ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తే నిరుద్యోగ సమస్య పరిష్కారం ప్రజలకు ప్రభుత్వ సేవలు అందుబాటుగా దొరకడం ద్వారా పరిపాలన సౌలభ్యం ఏర్పడి ప్రజలకు నిజమైన ప్రజాస్వామ్య ఫలాలు న్యాయబద్ధంగా అర్హత ప్రమాణికముగా అన్ని వర్గాలకు వేరేందుకు అణువుగా ఉంటుందన్నది కూడా చెప్పక తప్పదు, నేడు దీర్ఘ పరిస్థితులు కాలముగా శ్రీకాకుళం పట్టణంలో జిల్లా కేంద్రం ఉండడం వలన ఈ నాలుగు నియోజకవర్గాల సామాన్య ప్రజలకు ఆర్థికంగా వెనుకబడి నిస్సహాయులు అనరోగ్యముతో బాధపడుతున్న వారు పడుతున్న ఇబ్బందులు వర్ణా తీతం. నిజానికి సామాన్యులకు సమస్య పరిష్కారం కోసం కానీ వారికి సహాయం ప్రజా ప్రభుత్వము నుండి అందుకోవాలని కలెక్టర్ వారిని కలవాలి అంటే ఈ ప్రాంతం వారికి కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉంటుంది. ఎందుకంటే ఎంతోవెయ ప్రయాసలతో వెళ్తే శ్రీ కలెక్టర్ వారు కలుస్తారా లేదా సమస్య పరిష్కారం అవుతుందా లేదా. లేకుంటే పలుమార్లు వెల్లేందుకు వారి ఆర్థిక పరిస్థితి లేక ఆరోగ్య పరిస్థితులు సహకరించే పరిస్థితులు లేక ఎందరికో న్యాయమైన అర్హత కలిగి ఉన్న ప్రభుత్వ సహాయాలు సహకారాలు అందక ఉన్నటువంటి పరిస్థితులు కో కోళ్ళలుగా నున్నవి. అనుటకు సందేహం లేదు. వాస్తవానికి ప్రజా ప్రభుత్వాలు జిల్లాల పునర్విభజన అనే అంతాన్ని ప్రతిపాదించకుండా ఉంటే ఈ జిల్లా వాసు చేయగలిగిందేమీ లేదు. కానీ, ప్రభుత్వం రెండింతల పైచిలుక జిల్లాలను చీల్చి అక్కడ సరిహద్దులు పరిస్థితులను పరిగణలోకి తీసుకొని జిల్లాల సంఖ్యను రెట్టింపు చేసిన సందర్భంలో అత్యంత వెనుకబడిన సుధీర్ఘ ప్రాంతము కలిగి ఉన్న శ్రీకాకుళం జిల్లాకు న్యాయం చెయ్యవలసిన ఆవశ్యకత లేకపోలేదు. ఇది రాజకీయాలకు అతీతంగా విధముగా ప్రజల మనోభిష్టానికి ప్రాధాన్యత క్రమంలో పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సమన్యాయం సామాజిక న్యాయం అనే విధానానికి ప్రాంతీయ విభేదాలకు తావులేని విధముగా నేటి కూటమి సర్కారు వలన లేక టెక్కలి,అన్నది జిల్లా కేంద్రం అన్నది ముఖ్యముకానే కాదు. ఇక్కడ ఏర్పడవలసినదంతా కేవలము నాలుగు నియోజకవర్గాలకు జిల్లా ఏర్పడడం ఆవశ్యకము, ఏర్పడడం అవసరము న్యాయం.. కూటమి సర్కారు న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యం హక్కులను రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగే విధముగా ఇచ్చాపురం, పలాస , పాతపట్నం, టెక్కలి, నియోజకవర్గాలను కలుపుకొని ప్రభుత్వ నిర్ణయానుసారముకొత్త జిల్లా ఏర్పాటు మాత్రం ప్రభుత్వ నిర్ణయాలలో భాగముగా తప్పకుండా జిల్లా ఏర్పాటు చేస్తుందని ఆశిద్దాం.

