

వృద్ధులకు భోజనం పెడుతున్న ప్రవీణ్ దంపతులు…
నవతరం, సత్తునపల్లి: వృద్ధాప్యం శాపం కాదని వయస్సు రీత్యా ప్రతి ఒక్కరూ వృద్ధులు కావాల్సిందేనని, ఎన్ని దానాలు ఉన్న అన్నదానానికి మించిన దానం మరొకటి లేదని అన్నం పెట్టడం అంటే ప్రాణం నిలబెట్టడమేనని, వృద్ధుల ఆకలి తీర్చే ప్రయత్నంలో ప్రతివారు భాగస్వాములు కావాలని జన చైతన్య సమితి ప్రతినిధి కొరబండి ప్రవీణ్ అన్నారు. బాపట్లలోని రోమన్ క్యాథలిక్ మిషన్ దేవాలయ విచారణ గురువులు ఫాదర్ పెట్ల మరియదాసు పుట్టినరోజు సందర్భంగా పెద్దకూరపాడు జన చైతన్య సమితి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మరియదాసు కుటుంబీకుల సహకారంతో మంగళవారం సత్తెనపల్లిలోని ఆదరణ అనాధ వృద్ధుల శరణాలయంలో అన్నదానాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ వృద్ధుల అనుభవాలను కుటుంబ సభ్యులు తెలుసుకొని జీవితంలో ముందుకు వెళ్లాలని అన్నారు. ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరు వృద్ధాప్య దశకు చేరుకుంటారని అన్నారు. ఈకార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు. ముందుగా ఫాదర్ మరియదాసు జన్మదిన సందర్భంగా ఏర్పాటుచేసిన కేకు కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.

