విజయనగరం జిల్లా అధ్యక్షుడు పత్రికా సమావేశం…

0
304


నవతరం, విజయనగరం: విజయనగరం జిల్లా వైఎస్ఆర్సిపి పత్రిక సమావేశం నిర్వహించిన వైయ‌స్సార్సీపీ జిల్లా అధ్యక్షులు చిన్న శ్రీను ఈరోజు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తున్న కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో నిర్వహించిన కోటి సంతకాలు సేకరించిన పత్రాలు జిల్లా కార్యాలయానికి నియోజవర్గాల నుండి తరలివచ్చిన పత్రాలను రాష్ట్ర కార్యాలయానికి పంపే కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షులు, జడ్పీ చైర్మన్, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) విజయనగరం, ధర్మపురి తన క్యాంప్ కార్యాలయం అందు విజయనగరం జిల్లా వైఎస్ఆర్సిపి పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చిన్న శ్రీను మాట్లాడుతూ కోటి సంతకాల సేకరణ అనేది ప్రజా ఉద్యమం మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తున్న కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న కోటి సంతకాలు సేకరణ కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రాలు నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి నియోజవర్గాల నుండి తరలివచ్చిన సంతకాల పత్రాలను ఈనెల 15వ తేదీ అనగ సోమవారం నాడు ఉదయం 10 గంటలకు విజయనగరం CMR జంక్షన్ దగ్గర ఉన్న వైయస్సార్ గారి విగ్రహానికి నివాళులర్పించి అక్కడినుండి కన్యకా పరమేశ్వరి ఆలయం మీదగా మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి రాష్ట్ర కార్యాలయానికి తరలించే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అక్కడి నుంచి ఈనెల 18న గవర్నర్ గారికి ఈ సంతకాల పత్రాలు అందజేసే కార్యక్రమం పార్టీ చేపట్టిందని అని అన్నారుఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని మీడియా ద్వారా పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో వైయస్సార్ సిపి రాష్ట్ర కార్యదర్శులు నెక్కల నాయుడు బాబు, కెవి సూర్యనారాయణ రాజు, జిల్లా ఉపాధ్యక్షులు సత్తిబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శిలు వర్రి నరసింహ మూర్తి,రవికుమార్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు జైహింద్ కుమార్, జడ్పిటిసి శ్రీర అప్పలనాయుడు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here