టాలీవుడ్‌ని దున్నేస్తున్న పంజాబీకుడి రకుల్ ప్రీత్‌సింగ్ ఈమధ్య షూటింగులు, ఆడియో ఫంక్షన్లు, ఓపెనింగుల్లోనే కాదు సోషల్‌మీడియాలోనూ ఎక్కువగానే కనిపిస్తోంది. అమ్మడు ప్రేమలో పడిందనీ, ఆరడుగుల హీరోతో డేటింగ్‌లో ఉందనీ ఎన్నెన్నో గాసిప్స్. ఎన్నున్నా అలాంటిదేం లేదని చెప్పేయడం ఈ కాలపు సెలబ్రిటీస్‌కి కామనేగా..అలాగే నెట్టుకొచ్చేస్తోంది రకుల్‌ప్రీత్.

మూడుపదులు ఎప్పుడో దాటేసిన శ్రియలాంటి హీరోయిన్‌కూడా పెళ్లెప్పుడంటే అప్పుడే తొందరముందున్నట్లు మెలికలు తిరిగిపోతుంది. కానీ రకుల్‌ప్రీత్‌సింగ్ కాబోయే మొగుడెలా ఉండాలో పర్‌ఫెక్ట్ క్లారిటీతో ఉంది. అమ్మడి మెళ్లో మూడుముళ్లు వేయాలనుకున్నవాడు మంచి అందగాడై ఉండాలి. అన్నిటికీ మించి ఆరడుగుల బుల్లెట్ అయ్యుండాలంటోంది పంజాబీ బ్యూటీ. అంతకంటే ఇంచుతగ్గినా తనకంటికి ఆనడని ముందే చెప్పేస్తోంది.
రకుల్‌ప్రీత్‌సింగ్ నోట ఆరడుగుల మాటరాగానే ఆమె పక్కన ఫ్రేమ్‌లో భల్లాలదేవుడిని ఊహించేసుకుంటున్నారు సినీజనం. ఆరడుగుల ఎత్తున్న హీరోలు ఇండస్ట్రీలో చాలామందున్నా…అందరి దృష్టీ దగ్గుబాటి రాణా వైపే మళ్లుతోంది. ఇప్పటికే కొందరు హీరోయిన్లతో ఎఫైర్ ఉందన్న ప్రచారంలో మునిగి తేలుతున్నాడు రాణా. శ్రియతో అతని ఫ్రెండ్‌షిప్ ఓపెన్ సీక్రెట్. ఈమధ్య రకుల్ కూడా రాణా లైన్‌లో ఉందనే ప్రచారానికి…ఈ హీరోయిన్ కలల రాకుమారుడు సరిపోలుతున్నాడు. కొంపదీసి కొంగున కట్టేసుకుంటుందేమో మరి?

