
రాష్ట్ర చరిత్రలో ఇంత గొప్ప ఉద్యమ ఘట్టం ఎప్పుడు జరగలేదు ….!.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజా వ్యతిరేకతతో కూటమి సర్కార్ కళ్ళు తెరవాలి….!..
కొన్ని ప్రజా వ్యతిరేక మీడియాలో ఉద్యమ స్ఫూర్తిని కించుపరిచే విధంగా నున్నవి…..!.. అటువంటివారు వాస్తవాలను తెలియజేసే సమయం రావాలి…….!.. వైయస్సార్సీపి జిల్లా అధికార ప్రతినిధి బమ్మిడి దుర్యోధనరావు…..!.. నవతరం, పలాస: రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కూటమి సర్కార్ పీపీపీ విధానం అంటూ ప్రైవేట్ రంగానికి కట్టబెట్టేందుకు తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సిపి కొనసాగించిన పోరాటం చరిత్రలో ఇంతగా గొప్ప ఉద్యమ పోరాట ఘట్టం ఎక్కడా జరగలేదని , ఇదంతా కూటమి సర్కార్ పై వ్యతిరేకత కనిపిస్తుందని చెప్పడానికి వైఎస్ఆర్సిపి అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ ను కలవడానికి వెళ్ళినప్పుడు పార్టీ శ్రేణులతో పాటు భారీగా తరలివచ్చిన ప్రజలు, అభిమానులు బ్రహ్మరథం పట్టారని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏమిటని వైయస్సార్సీపి జిల్లా అధికార ప్రతినిధి బమ్మిడి దుర్యోధనరావు అన్నారు. శుక్రవారం ఆయన పలాసలో మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ పేరుతో చేపట్టిన ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజల నుంచి సేకరించిన కోటి సంతకాల పత్రులను రాష్ట్ర గవర్నర్ కు అందజేయడానికి వెళ్ళినప్పుడు జననేత వైయస్ జగన్ కుజనం నీరాజనం పట్టిన తీరు చూస్తే, కూటమి సర్కార్ చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలు ఏమిటో స్పష్టమైంది అన్నారు. పేదవానికి వైద్యంతోపాటు నిరుపేద విద్యార్థులు చదువుకోవడానికి వైద్య విద్యను దూరం చేయటానికి కూటమి సర్కార్ చేస్తున్న ప్రయత్నాన్ని ఈఉద్యమం ద్వారా కచ్చితంగా నిలుపుదల ఖాయమన్నారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుమేర పార్టీ శ్రేణులు నిర్వహించిన కోటి సంతకాల సేకరణకు ప్రజల్లో భారీగా స్పందన లభించింది అని తెలిపారు. విజయవాడలో భారీ ఎత్తున తరలివచ్చినజన సాగరం చూసి కూటమి నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయన్నారు. వైయస్సార్సీపి ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలు నిర్మాణానికి శ్రీకారం చుట్టడం వల్ల భవిష్యత్తులో నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన వైద్య విద్యార్థులకు మరిన్ని మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయన్న సంకల్పంతో నాడు వైయస్ జగన్ సర్కార్ ముందుకు అడుగులు వేయడం జరిగిందన్నారు. వైద్య విద్యకు ప్రాధాన్యతను సామాన్యులకిస్తూ అదే కాలేజీ మరియు హాస్పటల్గా సామాన్యులకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు ఈతోదికంగా దోహదపడతాయని బలమైన సంకల్పముతో మాజీ ముఖ్యమంత్రి ఆనాడు ఆలోచించి కార్యాచరణతో త్వరితగతిని కొన్నింటిని పూర్తిచేసి మెడికల్ కాలేజీలను ఇప్పటికే వైద్య విద్యకు అవకాశాలు కల్పించాలని మరికొన్ని కళాశాలలో అందుబాటులో రావడానికి కేవలం 5000 కోట్లు అవసరమని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా గాని రెండు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ, 5000 కోట్ల రూపాయలు మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఖర్చు పెడితే తద్వారా రాష్ట్రంలో సామాన్యులకు కూడా వైద్య విద్యతో పాటు ఉచిత ఆరోగ్య సేవలు అన్ని ప్రాంతాలలోనూ దొరికే అవకాశం ఉన్న నేటి కూటమి సర్కారు ఆ దిశలో అవసరమైన గాని పట్టించుకోకుండా, ప్రైవేటీకరణకు సిద్ధం కావడం కూటమి సర్కార్ వైఫల్యమేనని బమ్మిడి దుర్యోధనరావు విమర్శించారు. కూటమి సర్కార్ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడంలో కూటమీ నేతల కుట్ర ఉందని, ఇది ఒక పెద్ద స్కాం అన్నారు. కూటమి సర్కార్ పీపీపీ విధానం నిర్ణయం ఉపసంహరించు కొనే వరకు వైఎస్ఆర్సిపి మెడికల్ కాలేజీలను కాపాడుకునేందుకు రాజీలేని పోరాటం కొనసాగిస్తుందని బమ్మిడి దుర్యోధనరావు హెచ్చరించారు.

