రాష్ట్రంలో జంగిల్ రాజ్ పరిపాలన సాగిస్తున్న చంద్రబాబు…..!..

0
65

రాష్ట్రపతి పాలన తక్షణం రాష్ట్రంలో విధించాలి….!..

రెడ్ బుక్ రాజ్యాంగం కాదు….!.. అంబేద్కర్ రాజ్యాంగం వచ్చేవరకు పోరాటం చేద్దాం….!..

‘అంబటి’ ‘జోగి’ నివాసాలపై టిడిపి గూండాలు దాడి హేయం…..!..

రావణ కాష్టంగారాష్ట్రం మారడంతో…….!..

పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం లేదు….

నవతరం, పలాస: తిరుమల లడ్డూ అంశాన్ని డైవర్ట్ చేయడానికే ఈ దాడులు టిడిపి నేతల మాట వినని పోలీసులకు సైతం కేసుల్లో ఇరికించే కుట్రలు కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలనపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరపడ్డాయి పలాసలో అంబేద్కర్ విగ్రహం వద్ద వైయస్సార్సీపీ శ్రేణులతో రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు చేపట్టిన నిరసన కార్యక్రమం రాష్ట్రంలో సామాన్యుడి నుంచి రాష్ట్ర మాజీ మంత్రుల వరకు ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని, నిజాలు బయటపడినప్పుడు నియంతలు ఎప్పుడూ హింసికే పాల్పడతారని చెప్పడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని జంగిల్ రాజ్ మార్చారని రాష్ట్ర మాజీ మంత్రి, వైయస్ఆర్సీపీ పలాస నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో స్థానిక బస్టాండ్ వద్ద మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ నివాస గృహాలపై టిడిపి గూండాలు దాడి చేసిన ఘటనకు నిరసనగా వైఎస్ఆర్సిపి పలాస నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు నేతృత్వంలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, అక్కడ వైసీపీ శ్రేణులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ అప్పలరాజు మాట్లాడుతూ, గడిచిన 20 నెలలుగా రాష్ట్రంలో రాక్షస రాజ్యం, అరాచక పాలన రోజురోజుకు పెరిగిపోతుందన్నారు. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ నివాసాలపై టిడిపి గూండాలు దాడి చేసిన తీరు ప్రపంచమంతా చూసిందన్నారు. ఏకంగా మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి నిప్పు పెట్టి విధ్వంసం సృష్టిస్తే, అంబటి రాంబాబుపై హత్యాయత్నం చేశారని ఆయన ఆరోపణలు చేశారు. ఈ సంఘటనలకు ముందు మాజీ మంత్రి విడదల రజనీపై, మాజీ శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి పై, మరికొందరు వైసిపి నాయకులు , కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీకి చెందిన గూండాలు దాడి చేశారన్నారు. వారి అరాచకాలు దుర్మార్గం అన్నారు. రాష్ట్రాన్ని రావణ కాష్టంగా చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం శతవిధాల ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో రాజకీయంగా వైఎస్సార్సీపీని ఎదుర్కోలేక, ప్రజలకు మంచి పాలన అందించడం చేతకాక ఈ దురాగతాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇది జంగిల్ రాజ్ గా పిలవబడే బీహార్ లో కూడా ఇలా అమానుషమైన దాడులు నివాసాల మీద, కార్యాలయాల మీద జరగవన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న చంద్రబాబు రాజకీయ కుట్ర కోసం ఇంతగా దిగజాడడం సిగ్గుచేటునన్నారు. డైవర్షన్ రాజకీయాలు చేయడంలో చంద్రబాబు దిట్ట అని డాక్టర్ అప్పలరాజు విమర్శించారు. వైయస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై రాష్ట్రవ్యాప్తంగా దాడులకు తెగబడాలని కూటమి ప్రభుత్వ పార్టీ కార్యకర్తలు, గూండాలను ఆ రంగంలోకి దించిందని, వారు కర్రలు, రాళ్లు, ఇతర మారణాయుధాలు పట్టుకొని మరీ కనిపించిన వారిపై విచక్షణ రహితంగా దాడులతో విరుచుకు పడుతున్నారన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో విద్య, వైద్యం, వ్యవసాయం అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగితే.. చంద్రబాబు పాలనలో అరాచకాలు, ఆక్రమణలు, అత్యాచారాలతో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందన్నారు. నాలుగు సార్లు సీఎంగా చేసిన చంద్రబాబు రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని ధ్వజమెత్తారు. పైపెచ్చు రూ. 5కు టీ కూడా రాని ఈ రోజుల్లో 99 పైసలకే ఎకరం భూమిని రియల్ ఎస్టేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, రాష్ట్రంలో అరాచక పరిస్థితులు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు కావడంతో పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందుకు రాక ఇతర రాష్ట్రాలకు వెళ్ళి పోతున్నారన్నారు. శాంతి భద్రతలు పరిరక్షించవలసిన పోలీసు ఉన్నతాధికారులు సైతం రెడ్ బుక్ రాజ్యాంగంప్రకారం నడుచుకోవాలంటూ.. లేకపోతే వాళ్లపై కూడా చర్యలు తప్పవంటూ కూటమి ప్రభుత్వ పాలకులు బెదిరించడంతో.. పోలీసులు ప్రేక్షకు పాత్ర వహించడం పరిపాటిగా మారిందన్నారు. రాష్ట్రంలో అంబేద్కర్ వ్రాసిన రాజ్యాంగం ప్రకారం పరిపాలన సాగడం లేదని, రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల ప్రజల ప్రాణాలకు రక్షణ కరువైన నేపథ్యంలో, రాష్ట్ర గవర్నర్ జోక్యం చేసుకొని తక్షణం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డాక్టర్ అప్పలరాజు డిమాండ్ చేశారు. రాబోవు రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని, మళ్లీ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ అన్నను చేసుకునేందుకు ప్రజలు సిద్ధంగాఉన్నారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పచ్చ మూకల విధ్వంసం కొనసాగిస్తున్న తీరుపై వైఎస్ఆర్సిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో త్వరలో రాష్ట్రపతిని కలుస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను వివరించి రాష్ట్రపతి పాలన పెట్టాలని గవర్నర్కు కోరుతామని డాక్టర్ అప్పలరాజు స్పష్టం చేశారు. ఇప్పటికైనా పోలీస్ యంత్రాంగం, కేంద్ర హోం శాఖ చొరవ తీసుకొని రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి పలాస పట్టణ అధ్యక్షులు శిష్టు గోపి, పలాస ఎంపీపీ ప్రతినిధి ఉంగసాయి కృష్ణ యాదవ్, వైఎస్ఆర్సిపి జిల్లా అధికార ప్రతినిధి బండి దుర్యోధనరావు, మందస ఎంపీపీ డొక్కరి దానయ్య యాదవ్, వైఎస్ఆర్సిపి ఉపాధ్యక్షులు పైల చిట్టిబాబు, జిల్లా కార్యదర్శి దువ్వాడ మధుకేశ్వరరావు, వైఎస్ఆర్సిపి మందస మండల యువజన అధ్యక్షులు సేనాపతి కిషోర్, వైఎస్ఆర్సిపి పలాస రూరల్ అధ్యక్షులు దువ్వాడ రవి, కౌన్సిలర్లు కర్రీ మాధవరావు, గుజ్జు జోగారావు, దున్న నిర్మల సత్యం, వైఎస్ఆర్సిపి నేతలు అందాల శేషగిరి యాదవ్, చింతాడ గణపతి, బాడ జగన్నాయకులు, బత్తిన తేజ, అగ్గున సూర్యారావు, సొర్ర ఢిల్లీ శ్వరరావు, చింతాడ మాధవరావు, పినకాన ముకుంద, మార్పు కృష్ణ, మార్పు వెంకటరమణ, మల్ల సురేష్, వాయులపల్లి శ్రీనివాసరావు, సరస్వతి, మార్పు యుగంధర్, యాళ్ల సంతోష్, రాపాక శేషగిరి, కర్రి గోపాల్, నర్తు వెంకటరమణ యాదవ్, కిర్రి రాజారావు, బగాధి హరికృష్ణ, అంబటి ఆనంద్, మజ్జి హేమరాజ్, నాగేశ్వర్ బృందావన్, తమ్మినాన శాంతారామ్, డొక్కరి హరికృష్ణ, దల్లి జానకి రెడ్డి, ఈరోతు హేమ సుందర్, బిరాటి వల్లభ, కంచరాన చినబాబు తదితరులతో పాటు నియోజకవర్గం నలుమూలల నుంచి వైయస్సార్సీపి నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here