రాజ్యాధికారం దిశగా ముద్రగడ అడుగులు….

0
354

బిసి, ఎస్సీ, కాపు సోదరులకు ముద్రగడ పిలుపు….

ఈ కులాంటే అంత సులకనా…?

దేశానికి స్వాతంత్య్రం వచ్చినా రాష్ట్రంలో ఉన్న బిసి, ఎస్సీ కాపు కులస్తులకు స్వాతంత్య్రం రాలేదని కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ ఆవేదన వ్యక్తం చేశారు.

ముద్రగడ కామెంట్స్:

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి కొన్ని కులాలు మాత్రమే రాజ్యాధికారం అనుభవిస్తున్నాయి.

ఎక్కువ జనాభా కలిగి ఉన్న ఈ కులాలు మాత్రం నిత్యం మీ పల్లకీ మొయ్యాలా?

తక్కువ జనాభా కలిగిన వారే అధికారం అనుభవించాలా?

రాజకీయాలలో మార్పునకు కృషి చేద్దాం.

అధికారం గుంజుకోవాలి తప్ప.. బిక్షం వెయ్యమని అడగకూడదు.

ఈ రాష్ట్రంలో మనం బిక్షం వెయ్యమని అడగితే వెయ్యరు. ఈ రాష్ట్రం మనందరిదీ..

ఇది రాజ్యాధికారం కోసం విప్లవం, శాశ్వత రాజ్యం కోసం ఉద్యమంలా ముందుకు సాగుదాం.

మనం ఎవ్వరికీ వ్యతిరేకం కాదు.. ఈ రాష్ట్రం ఎవ్వరి ఎస్టేట్ కాదు, ఎవ్వరి జాగీరు అంతకన్నా కాదు..

అంగులు ఆర్భాటాలు లేకుండా చాపకింద నీరులా ఈ విప్లవం ముందుకెళితే మంచిది.

రాజకీయాలలో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి. అన్నింటినీ ఎదుర్కొని విప్లవాన్ని చివరి వరకు తీసుకెళితే మంచిదే.. చివరి వరకూ తీసుకెళ్లాలని ఆశిద్దాం…