
పలాస ప్రోగ్రెసివ్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దేవ విశ్వేశ్వరరావు.
నవతరం, పలాస: భారత రాజ్యాంగం నాలుగవ ఎస్టేట్ గా పిలిచే మీడియాకు ఉన్నతమైన స్థానం కల్పించిందని పలాస ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దేవ విశ్వేశ్వరరావు (నాని) తెలిపారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం పలాసలోని స్థానిక ప్రెస్ క్లబ్ వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. రిపబ్లిక్ డే వేడుకలను పురస్కరించుకొని ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం స్వాతంత్ర్యం అనంతరం 1950 జనవరి 26న అమలు అయిందని, ఆదినాన్ని ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవంగా ఆచరిస్తున్నామన్నారు. భారత రాజ్యాంగం స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రా తత్వానికి సముచిత స్థానం కల్పించిందని, తద్వారా ఫోర్త్ ఎస్టేట్ గా పిలవబడే మీడియాకు రాజ్యాంగంలో స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు సంపూర్తిగా కల్పించడం ద్వారా నేడు మీడియా ప్రజా స్పందనను స్వేచ్ఛగా వినిపించ గలుగుతుందన్నారు. విభిన్న కులాలు మతాలు జాతులు కలిగిన భారతదేశం ఇప్పటికీ భిన్నత్వంలో ఏకత్వం కలిగి అభివృద్ధి పథంలో ముందుకు సాగిపోతూ ప్రపంచంలోనే సుస్థిరమైన అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా ఆవిర్భవించడం మన రాజ్యాంగ ఉతృష్టతకు అద్దo పడుతుందన్నారు. అయితే ఒక్కొక్కసారి మీడియా స్వేచ్ఛను హరించే నిరంకుశులు లేకపోలేదని, మెజార్టీ ప్రజానీకం ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజల గొంతును వినిపించడమే మీడియా లక్ష్యమని దేవ విశ్వేశ్వరరావు (నాని) స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ తలగాపు వెంకటరమణ, బందాపు తిరుమల, డొక్కరి కృష్ణారావు, రామారావు, చలపతిరావు, వాసు తదితరులు పాల్గొన్నారు.

