
నవతరం, విజయనగరం: ఆయన మరో విజయం సాధించారు.. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ఆవు రమణారావు మళ్ళీ రిపబ్లిక్ దినోత్సవ పురస్కారాన్ని అందుకున్నారు.నేర పరిశోధనలో ఎన్నెన్నో జటిలమైన కేసులను చేధించి గతంలో మెడల్స్.. సర్టిఫికెట్లు అందుకున్న రమణారావు సోమవారం నాడు కలెక్టర్ సుందరరామి రెడ్డి.. ఎస్పీ దామోదర్ చేతుల మీదుగా గణతంత్ర దినోత్సవ పురస్కారాన్ని అందుకున్నారు.
గంజాయి రవాణా.. బులెట్ల చోరీ.. బంగారం చోరీ వంటి కేసులను చేయించడంలో రమణారావు అందె వేసిన చెయ్యి..
తాను గత ఏడాది కూడా గణతంత్ర దినోత్సవ పురస్కారాన్ని అందుకున్నానని.. ఈ పురస్కారాలుతన బాధ్యతను మరింతగా పెంచుతూ ఇంకా అంకితభావంతో విధినిర్వహణ చేసేట్లుగా ప్రోత్సహిస్తున్నాయని పురస్కారం అందుకున్న సందర్భంగా రమణ అన్నారు. తనను పురస్కారానికి ఎంపిక చేసిన ఎస్పీ దామోదర్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

