
యస్,సిహెచ్ బి ఆర్ యం ను విలీనం చేస్తాం.. విద్యార్థుల భవిష్యత్తును కాపాడుతాం .. విద్యార్థులతో ఎమ్మెల్యే గ్రంధి..
నవతరం, భీమవరం: పట్టణంలో ఉన్న S.CH.B.R.M స్కూల్ ను ఎయిడెడ్ కొనసాగించాలి లేదా ప్రభుత్వం లో విలీనం చెయ్యాలి అని విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు,SFI భీమవరం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించి ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కు వినతిపత్రం అందించారు..ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కే సూర్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీఓనెంబర్42 జీఓ నెంబర్52 తీసుకురావటం వల్లన ఎయిడెడ్ స్కూల్స్ అన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్ళటం వల్లన ఫీజులు ఎక్కువగా పెరిగిపోతాయని,DNR కాలేజీ అసోసియేషన్ ఇప్పటికే స్కూల్ ని ప్రైవేట్ గా నడుపుకుంటాం అని విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసి మీ పిల్లలని వేరే స్కూల్స్ లో జాయిన్ చెయ్యండి అని చెప్పారని, దీంతో తల్లిదండ్రులలో ఆందోళన నెలకొందన్నారు. 1953లో ఎంతో మంది దాతల సహకారంతో బడుగు బలహీన వర్గాల ప్రజలకు విద్య అందుబాటులో ఉండాలని చారిత్రాత్మక మైన ఉన్నత పాఠశాల ను ప్రారంభించారన్నారు. కానీ ఇప్పుడున్న యజమాన్యం స్కూల్ పేరుతో వ్యాపారం చేయాలని చూస్తుందన్నారు రెండవ పట్టణం లో కో ఎడ్యుకేషన్ ఉన్నత పాఠశాల ఇదేనన్నారు. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ గమాట్లాడుతూ పాఠశాల ను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు చూస్తామని విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని హామీ ఇచ్చారు.విధ్యార్ధులకు ఉత్తమమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం క్రృషి చేస్తుందన్నారు. ఫీజులు కూడా ప్రజలకు అందుబాటులో ఉండడానికి ముఖ్యమంత్రి క్రృషి చేస్తున్నారన్నారు. విద్యార్థులతో ఆయన ముచ్చటించారు.ఈ కార్యక్రమంలో భీమవరం మండల అధ్యక్షులు రాజ్ కుమార్ టౌన్ కమిటీ సభ్యులు నరేష్ ప్రతాప్ సాయి యశ్వంత్ పూర్వ విద్యార్థులు చిన్న రాము శివ పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు

