

మావుళ్ళమ్మ అమ్మవారి మహా నివేదన…
30 రోజులపాటు నిర్విరామంగా ఉత్సవాలు…
అన్నపూర్ణ దేవి అలంకరణలో దర్శనం..
లక్ష 21 వేలు పలికిన లడ్డు..
నవతరం, భీమవరం: మహా ప్రసాదం .. 30 రోజులపాటు పూజలందుకున్న శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి 58వ మహోత్సవాలు శుక్రవారంతో ముగిసాయి. అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించేందుకు భక్తులు తరలివచ్చారు.. భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి వార్షిక మహోత్సవాలు ముగింపు సందర్భంగా మహా నివేదన నిర్వహించారు. ఉదయం 7.30 నిమిషాలకు ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లిఖార్జున శర్మ అధ్వర్యంలో
ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తనయుడు గ్రంధి రవితేజ చే పూజా కార్యక్రమాలను నిర్వహించారు. జనవరి 13న ప్రారంభమైన అమ్మవారి ఉత్సవాలు శుక్రవారం మహా నివేదనతో ముగిసాయి. బుర్రకథలు, హరికథలు, కోలాటాలు, సంగీత విభావరి, సినీ మ్యూజిక్ నైట్, విద్యుత్ కాంతులతో నెలరోజులపాటు ఉత్సవాలు అంబరాన్ని తాకాయి. మహా నివేదన అనంతరం 9 కేజీల లడ్డూను లక్ష 21 వేలకు దక్కించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో దాసరి శ్రీరామ వర ప్రసాద్ రావు, నీరుల్లి కూరగాయల పండ్ల వర్తక సంఘం సభ్యులు కొప్పుల సత్తిబాబు, రామాయణం గోవిందరావు, రామాయణం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

