
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి అందిస్తున్న ఆర్వీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు సీమ కృష్ణ రాథోడ్…..!.. యూనివర్సిటీలో నాన్ బోర్డర్స్ రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి…..!.. నవతరం, కర్నూలు: రాయలసీమ విశ్వవిద్యాలయంలోని గ్రంథాలయం ముందు డిసెంబర్ 9 తారీఖున జరిగిన నాన్ బోర్డర్ పుట్టినరోజు వేడుక జరిపిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం ఆర్ యూ డా.బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందచేశామని రాయలసీమ ఉద్యమ యువ నాయకులు,రాయలసీమ విద్యార్థి సమైక్య వ్యవస్థాపక అధ్యక్షుడు సీమ కృష్ణ రాథోడ్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయలసీమ విశ్వవిద్యాలయంలో ఎటువంటి అనుమతులు పొందకుండా రాయలసీమ విశ్వవిద్యాలయంలో కొందరు స్టూడెంట్ లీడర్స్ గ్రంథాలయం ముందర కేక్ కట్ చేపిస్తూ, తరగతి గదులు బహిష్కరిస్తూ రెండు వాహనాలు ముందర టపాసులు పేలుస్తూ ఈ వేడుక నిర్వహించిన వారిపై రాయలసీమ విశ్వవిద్యాలయం అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని వారు తెలియజేశారు. అయితే కమిటీ వేసి విచారణ జరిపి తూతూ మంత్రంగా చర్యలు తీసుకోకుండా ముగిసినట్టు తెలిసిందని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు ప్రోత్సహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకొని వారిని యూనివర్సిటీ నుంచి సస్పెండ్ చేయాలని తెలియజేశారు.

