భీమవరం ఆక్సిజన్ ప్లాంట్ ను ప్రారంభిస్తున్న మంత్రి….

0
341

భీమవరంలో మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్ ను ప్రారంభిస్తున్న మంత్రి శ్రీరంగనాథరాజు…

దాత అడుసుమిల్లి వెంకట సుబ్రమణ్యంను సత్కరిస్తున్న దృశ్యం

ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యం… కరోనా కష్టాలను ధీటుగా ఎదుర్కొన్నాం… దీపక్ నెక్స్ జెన్ అధినేతకు కృతజ్ఞతలు ..
మంత్రి శ్రీరంగనాథరాజు

భీమవరం,నవతరం;
ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పని చేస్తున్నారని రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు.. కృష్ణాజిల్లా బొమ్ములూరు కు చెందిన దీపక్ నెక్స్ జెన్ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత అడుసుమిల్లి వెంకట సుబ్రహ్మణ్యం
సహకారం తో రూ.కోటి ఖర్చుతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఏర్పాటుచేసిన మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్ ను ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సమక్షంలో మంత్రి శ్రీరంగనాథరాజు మంగళవారం ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ కరోనా రెండు దశల్లో కూడా అనేకమంది ఆక్సిజన్ అందక చనిపోయారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విమానాల ద్వారా కూడా ఆక్సిజన్ ను తీసుకొచ్చి కరోనా బాధితుల ప్రాణాలను రక్షించారని అన్నారు. ఒకపక్క కోవిడ్ కేర్ సెంటర్లను నిర్వహిస్తూ, మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ప్రైవేట్ ఆస్పత్రులలో వైద్య సేవలు అందించడం జరిగిందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కరోనా వైరస్ ను నియంత్రించడానికి రేయింబవళ్ళు చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. ఏఎన్ఎంలు ,ఆశ వర్కర్లు, వలంటీర్ల ద్వారా ఇంటింటికి ఫీవర్ సర్వే లు కూడా చేయడం జరిగిందని అన్నారు. కరోనా బాధితులు మరణించిన పరిస్థితుల్లో వారి అంత్యక్రియల ను కూడా కుటుంబ సభ్యులు దగ్గరుండి చేయలేని భయానక పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కరోనా మృతుల అంత్యక్రియలను వారి వారి సంప్రదాయబద్ధంగా నిర్వహించేలా చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. కరోనా వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింతగా దెబ్బతిన్నప్పటికీ, కరోనా ను జయించడమే లక్ష్యంగా పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేశారని అన్నారు. కరోనా బాధితులను రక్షించడానికి ప్రజాప్రతినిధులుగా తమ పరిధిలో ఉన్న ప్రతి పనిని చిత్తశుద్ధితో నిర్వహించామని తెలిపారు .భీమవరంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సొంతంగా ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్స్ను కొనుగోలు చేసి ప్రభుత్వ ఆసుపత్రి కి అందించి అనేకమంది కరోనా బాధితులు ప్రాణాలను కాపాడారని అన్నారు. ఈ దశలో భవిష్యత్తులో ఆక్సిజన్ కొరత రాష్ట్రంలో తలెత్తకుండా ప్రభుత్వ ఆసుపత్రి లలో ఆక్సిజన్ ప్లాంట్ల లను ప్రభుత్వం నిర్మిస్తుందని తెలిపారు .కాగా భీమవరం ప్రభుత్వ ఆస్పత్రికి కృష్ణాజిల్లా బొమ్ములూరు కు చెందిన దీపక్ నెక్స్ జెన్ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత అడుసుమిల్లి వెంకట సుబ్రహ్మణ్యం రూ కోటి ఖర్చుతో మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్ నిర్మించి ప్రభుత్వానికి అప్పగించడం పట్ల ఆయనకు ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు .కరోనా వైరస్ సమయంలో ప్రాణాలు రక్షించడానికి డబ్బులు కూడా ఉపయోగపడ లేదని అన్నారు. తాతల నుండి తండ్రుల నుండి ఎంత ఆస్తులు వచ్చాయి, మనం ఎంత సంపాదించాం అనే దానిపై దృష్టి పెట్టకుండా వీలైనంత వరకు సేవా కార్యక్రమాలు చేసి ప్రజల్లో మన పేరును చిరస్థాయిగా నిలిచిపోయేలా ప్రతి ఒక్కరు నడుచుకోవాలని అన్నారు. అడుసుమల్లి వెంకట సుబ్రహ్మణ్యం ను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు సమాజానికి ఉపయోగపడే విధంగా ఎవరికి వారు స్పందించాల్సి ఉంది అని అన్నారు. భీమవరంలో త్వరలోనే వంద పడకల ఆసుపత్రి నిర్మాణం జరుగుతుందని ,ఈ ఆస్పత్రి నిర్మాణానికి ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు నాలుగు ఎకరాల విలువైన భూమిని ప్రభుత్వానికి అప్పగించడం పట్ల ఆయనకు ప్రజల పట్ల ఉన్న ప్రేమ ,అభిమానం తెలియజేస్తుందని అన్నారు. సభకు అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ కరోనా సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రజల ఆరోగ్య భద్రత కోసం తీసుకున్న చర్యల వల్ల అనేకమంది వెంటిలేటర్ల మీద ఉన్న కరోనా బాధితులు కూడా తిరిగి ప్రాణాలతో సురక్షితంగా ఇంటికి చేరుకున్నారని గుర్తు చేశారు. కరోనా వైద్యాన్ని ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకోవడంతో పాటుగా ,బ్లాక్ ఫంగస్ వైద్యం కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చి సామాన్య, మధ్య తరగతి ప్రజలను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కరోనా బారినుండి ఆదుకున్నారని అన్నారు. అదే సమయంలో భీమవరం ప్రాంతంలో కరోనా బాధితులను ఆదుకోవడానికి తాను సొంతంగా రూ 14 లక్షలు వెచ్చించి ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్స్ ను కొనుగోలు చేసి ప్రభుత్వ ఆసుపత్రికి అందించడం జరిగిందన్నారు. తనతో పాటుగా నియోజకవర్గంలోని అనేక మంది దాతలు కూడా ముందుకు వచ్చి దాదాపు 70
ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్స్ ను కొనుగోలు చేసి ప్రభుత్వ ఆసుపత్రికి అందించా రని తెలిపారు. మరో 30 వాటిని జిల్లా కలెక్టర్ కోరిక మేరకు ఏజెన్సీ ప్రాంతానికి పంపించడం జరిగిందని అన్నారు. భీమవరంలో ఆక్సిజన్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని దాత సుబ్రహ్మణ్యం ను కోరగా ఆయన వెంటనే స్పందించి రూ. కోటి ఖర్చుతో మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం ఈ ప్రాంత ప్రజలకే కాకుండా నరసాపురం పార్లమెంట్ పరిధిలోని ప్రజలందరికీ కూడా అదృష్టమని అన్నారు. ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞత లు తెలుపుతున్నాను అని తెలిపారు. ఈ ప్లాంటు నిర్మాణానికి సహకరించిన భగవాన్ ట్రేడర్స్ అధినేత నడింపల్లి వెంకట రామరాజు కు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రజా ఆరోగ్యం పై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వేల కోట్ల నిధులను ఖర్చు చేస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగా నాడు-నేడు పథకంలో ప్రతి ప్రభుత్వాసుపత్రిని అన్ని వసతులతో ఆధునిక రీ స్తున్నామని అన్నారు .ఎమ్మెల్సీ కొయ్యే మోషేన్రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైద్యానికి ప్రాధాన్యత కల్పించారని అన్నారు. అనంతరం దాత సుబ్రహ్మణ్యం ను, సహకరించిన నడింపల్లి వెంకట రామరాజు ను మంత్రి శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ,ఎమ్మెల్సీ కొయ్యే మోషేన్రాజు లు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో దీపక్ నెక్స్ జెన్ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ ల తో పాటుగా ఏఎంసీ చైర్మన్ తిరు మా ని ఏడుకొండలు, ఎంపీపీ పేరిచర్ల విజయ నరసింహ రాజు ,జెడ్ పి టి సి కాండ్రేగుల నరసింహారావు ,రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ కామన నాగేశ్వరరావు తాసిల్దార్ ఏ వి రమణ రావు, ఎంపీడీవో జి పద్మ, మున్సిపల్ కమిషనర్ ఎం శ్యామల, సూపర్డెంట్ వీరస్వామి, సర్పంచులు కోళ్ల బాలకృష్ణ , మంగతాయారు, తిరు మా ని శ్రీనివాస్ , వీరవెల్లి శ్రీనివాస్ ,జల్లా కొండయ్య , వెంకటేష్ ,కొట్టి కుటుంబరావు ,ఏ ఎస్ రాజు ,గూడూరి ఓంకార్, నామం మహేష్ ,కోమటి రాంబాబు, కోడి యుగంధర్, మద్దాల రమణ, నల్ల రాంబాబు, ముద్దుల కరుణ కుమార్ ,నాగ రాజు శ్రీనివాసరాజు, శ్రీరాంపురం ఫణిరాజు లతోపాటు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.