చర్ల, డిసెంబర్ 06 (నవతరం): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 66వ వర్థంతి సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సోయం రాజరావు అధ్యక్షతన ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సోయం రాజారావు మాట్లాడుతూ బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అన్నారు. బడుగు బలహీన వర్గాలు అభ్యున్నతికి కృషిచేశారని, నేటి యువత వారి ఆశయాలను పునికిపుచ్చుకొని దేశ అభ్యున్నతికి కృషిచేయాలని అన్నారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరం అయినప్పటికీ సమాజంలో ఇంకా వెనకపడివున్న దళితుల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం దళితబందు వంటి పథకం పెట్టి వారి కుటుంబాలలో వెలుగులు నిపుతున్నదని అన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా హైదరాబాద్ నగరంలో అతి ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తుందని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శి అలం ఈశ్వర్, ఎస్సీ సెల్ అధ్యక్ష కార్యదర్శులు తోటమల్ల వరప్రసాద్, పాగా రాంప్రసాద్, మహిళ విభాగం అధ్యక్షురాలు పోలూరి సుజాత, బీసీ సెల్ అధ్యక్షులు దొడ్డి సూరిబాబు, రైతుబందు సమితి చర్ల క్లస్టర్ ఇంచార్జ్ తోటపల్లి మాధవరావు, జిల్లా నాయకులు బండి వేణు, యూత్ అధ్యక్షులు కాకి అనిల్, మహిళ నాయకురాలు పాసికంటి శ్రీదేవి, తిప్పాపురం సర్పంచ్ కన్నారావు, సీనియర్ నాయకులు గోరెంట్ల వెంకటేశ్వర్లు, యూత్ నాయకులు కవ్వాల రాంబాబు, కట్టం కన్నారావు, సిద్ది రాజశేఖర్, తోటమల్ల శివాజీ, మేడబత్తిని గోవర్ధన్, మైపా ఈశ్వర్ రావు ముఖ్యకార్యకర్తలు పాల్గొన్నారు.


