
నవతరం, పచ్చిమ గోదావరి: ప్రజలు రాకపోకలు సాగించే రహదారులే ప్రమాదాలకు కారణమైతే దానికి మీరే బాధ్యులని కలెక్టర్ పి.ప్రశాంతి ఆర్ అండ్ బీ అధికారులనుద్దేశించి వ్యాఖ్యానించారు. ఆర్అండీబీ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించి మాట్లాడారు. మరమ్మతులు చేసిన రహదారులు మళ్లీ పూర్వస్థితికి రావడంపై ఆమె ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమవరంలో ఉండి బైపాస్ రోడ్డు దుస్థితి చూస్తే మీశాఖ పనితీరుకు మచ్చలా ఉందన్నారు. రహదారులను నాణ్యతతో వేయాలన్నారు.

