ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం…

0
292


నవతరం, భీమవరం: శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరం పట్టణంలో స్థానిక వెంకట్రామా థియేటర్ కాన్ఫరెన్స్ హాల్ నందు నిర్వహించారు.
సదస్సును ప్రారంభించిన డాక్టర్ సి ఎస్ ఎం జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సలీమ్ ఖాన్ మాట్లాడుతూ ప్రపంచంలో అత్యధిక భాగం ప్రమాదాలు జరిగినప్పుడు రెడ్ క్రాస్ సంస్థ ముందుంటుందని ప్రకృతి వైపరీత్యాలు యుద్ధ సమయాల్లో కూడా క్షతగాత్రులకు అందించే సహాయం అద్వితీయం అన్నారు. న్యాయవాది కొండపల్లి రమేష్ నాయుడు మాట్లాడుతూ రెడ్ క్రాస్ సేవా సంస్థకు, కేంద్రంలో రాష్ట్రపతి, రాష్ట్రాల్లో గవర్నర్, జిల్లాల్లో కలెక్టర్ అధ్యక్షులుగా ఉంటారని, ప్రభుత్వానికి స్వచ్ఛంద సంస్థలు అందించే సేవకు రెడ్ క్రాస్ నిదర్శనం అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి సేవా ప్రతిజ్ఞ నిర్వహించి, 1863 జెనీఫా, స్కాట్లాండ్ దేశాలలో హెన్రీ దో వ్ నాట్ స్థాపించారని, ఆయన జన్మదినం 1828 మే 8న ప్రపంచ రెడ్క్రాస్ దినోత్సవం నిర్వహిస్తారని అన్నారు. దళిత సంఘం నాయకులు గంటా సుందర్ కుమార్ మాట్లాడుతూ జాతీయ సమైక్యత భావంతో రెడ్ క్రాస్ సేవలు అందిస్తుందని 1986లో భీమవరం వరదలతో చిక్కుకున్నప్పుడు సినీ నటులు సూపర్ స్టార్ కృష్ణ లక్షా 25 వేల రూపాయలు రెడ్ క్రాస్ సంస్థ ద్వారా అందించి బాధితులను ఆదుకున్నారని అన్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ దాసి రెడ్డి అనిరుద్ రెడ్క్రాస్ సేవల గురించి వివరించారు. లయన్స్ క్లబ్ సభ్యులు నరహరి శెట్టి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 14 రోజులు కుష్టువ్యాధి కాలనీలో వృద్ధాశ్రమాలలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఈ సమావేశంలో తీర్మానించారు.