ప్రజా ఆగ్రహ సభకు తరలివెళ్లిన కొత్తపేట నియోజకవర్గ బీజేపీ నేతలు….

0
366

నవతరం, రావులపాలెం: బీజేపీ ఆధ్వర్యంలో విజయవాడలో మంగళవారం నిర్వహిస్తున్న ప్రజా ఆగ్రహ సభకు కొత్తపేట నియోజకవర్గ బీజేపీ నేతలు తరలివెళ్లారు. రాష్టంలో వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బీజేపీ నాయకత్వంలో ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు సార్యధ్యంలో చేపట్టిన ఈ ప్రజా ఆగ్రహ సభకు రాష్ట్ర స్వచ్ఛ భారత్ కన్వీనర్ పాలూరి సత్యానందం. మహిళా మోర్చా అమలాపురం పార్లమెంట్ జిల్లా అధ్యక్షురాలు. నందం శ్రీలక్ష్మి. జిల్లా కార్యవర్గ సభ్యులు మద్దిoశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొత్తపేట రావులపాలెం మండలాల నుండి అధిక సంఖ్యలో బస్సుల్లో కారుల్లో తరలివెళ్లారు ఈ సందర్భంగా మండలం పరిధిలోని ఈతకోట గ్రామంలో జాతీయ రహదారి చెంతన గండ్రోతు వీరగోవిందరావు ఆధ్వర్యంలో వైసీపీ అరాచకాలు నశించాలి. జై బీజేపీ జై మోడీ జై సోము అంటూ నిదానాలు చేసి విజయవాడ సభకు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు గోనెమడతల కనకరాజు. పొనుగుపాటి శ్రీనివాస్. సంపతి కనకేశ్వరరావు. మేడిశెట్టి వెంకట్రావు. ఎమ్. బాబీ. జీ. రాజు. కడలి సుబ్బారావు. నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.