
అభివృద్ధి భారత్ అంటూ అందలమెక్కిపోయామని చెప్పుకుంటున్న ప్రజా ప్రభుత్వాల తీరుపై విస్మయం కలుగుతుంది…..!..


నవతరం, విశాఖపట్నం: విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఏర్పడిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం తమ ఉనికిని త్యాగము చేసి నిరాశ్రయులైన వేలాదిమంది నిర్వాసితులకు నేటికీ న్యాయం జరగకపోవడం పాలకుల నిర్లక్ష్యం ప్రజల పట్ల ప్రజా ప్రభుత్వాల వ్యవహరిస్తున్న తీరుకు నిదర్శనం…..!..
ఈ ఆందోళన ఆవేదనలు ఆకలి కేకలు నేటివి కావు నాలుగు దశాబ్దాల క్రితం నుండి కొనసాగుతూనే ఉన్నాయి కానీ వీటి పట్ల ఎవరికి బాధ్యత, అభిమానము, కరుణ, జాలి, న్యాయం, ధర్మం ఏ ఒక్కటి పనిచేయలేదు వీరి పట్ల…..!… సాధ్యము కాని హామీలు ఇస్తూ కులమతాలను రెచ్చగొడుతూ కులమతాల విద్వేషాలను యదేచ్చగా వాడుకుంటూ అబద్ధపు హామీలతో ప్రజా ప్రతినిధులుగా ప్రజల ఓట్లతో గెలిచి సభలలో పాల్గొని నిబద్దతలేని నేటి ప్రజాస్వామ్య ప్రజా ప్రతినిధులు సమస్యల పట్ల ప్రజల జీవన విధానం పట్ల సమాజంలోని జరుగుతున్న అంతరాయాలు తదితర అంశాలపై ఏనాడూ దృష్టిసారించక ప్రజాధనంతో చట్టసభలలో ఒకరి పట్ల ఒకరు ఒక రాజకీయ పక్షానికి మరొక రాజకీయ పక్షానికి వాదోపవాదాలకు సభా సమయము గడిపేస్తూ కీలకమైన అంశాలను దీర్ఘకాల సమస్యలను ఏనాడు చర్చించక చివరకు కొన్ని వర్గాలకు అధోగతి పాలు చేస్తున్నారు. ఇదే కోవకు చెందిన వారు కూడా స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక ప్రజాప్రతినిధుల బాధ్యత తీసుకొని తక్షణమే పూర్తిస్థాయిలో నిర్వాసితులకు న్యాయం చేస్తారని చేయవలసిన ఆవశ్యకత ఉందని అన్ని వర్గాల వారు ముక్తకంఠముతో ఘోషిస్తున్నారు. న్యాయమైన ఈ స్వల్ప సున్నితమైన సమస్యను తక్షణమే ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో న్యాయం చేసేందుకు ముందుకొస్తాయని ఖచ్చితముగా నాలుగు పదులు నిండి నిస్సహాయితతో జీవితాలను వెల్లబుస్తున్న ఇచ్చిన హామీలను మర్చిపోయిన ప్రభుత్వాల చర్యల వలన అన్ని విధాలా నష్టపోయిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకు తక్షణమే న్యాయం జరుగుతుందని ఆశిద్దాం.

