
శ్రీ విజ్ఞాన వేదిక సంయుక్త లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పాలగుమ్మి పద్మరాజు మరియు జిడ్డు కృష్ణమూర్తి లకు ఘన నివాళులు…
నవతరం, భీమవరం: స్థానిక వెంకట్రామ హాల్లో, శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మహా తత్వవేత్త, జిడ్డు కృష్ణమూర్తి మరియు రచయిత పాలగుమ్మి పద్మరాజు వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి ఎం సీతారామ ప్రసాద్ అధ్యక్షత వహించి మాట్లాడుతూ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రపంచ కథానికల పోటీలో రెండో బహుమతి పొందిన గాలివాన కథా రచయిత హేతువాది ఎం.ఎన్.రాయ్ భావాల ప్రచారకుడు, పాలగుమ్మి పద్మరాజు అని కొనియాడారు. జవ్వాది శ్రీనివాస్ మాట్లాడుతూ పద్మరాజు జూన్ 24, 1915 న పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలములోని తిరుపతిపురంలో జన్మించారని ఈయన 1939 నుండి 1952 వరకు కాకినాడ లోని పీ.ఆర్.ప్రభుత్వ కళాశాలలో సైన్సు లెక్చరర్‌గా పనిచేశారని, గొప్ప గుర్తింపు పొందిన వ్యక్తికి ఘన నివాళులు అర్పించడం హర్షణీయమన్నారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు నందమూరి రాజేష్ మాట్లాడుతూ జిడ్డు కృష్ణమూర్తి జిడ్డు కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక తత్వవేత్త. మే 12, 1895 న ఆంధ్ర ప్రదేశ్ లోని మదనపల్లెలో ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. 1929 నుండి 1986 లో తను మరణించే వరకు ప్రపంచం నలుమూలల ప్రయాణిస్తూ తాత్విక, ఆధ్యాత్మిక విషయాలపై అనేక ప్రసంగాలు చేశారని, కాలిఫోర్నియా, యునైటెడ్ స్టేట్స్ లో మరణించారని, మనిషి తనంతట తానుగా భయం, కట్టుబాట్లు, అధికారం, మూఢవిశ్వాసాల నుండి విముక్తి చెందాలని బోధించారని అన్నారు.
ఈ కార్యక్రమంలో నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి, లయన్స్ క్లబ్ సభ్యులు నరహరిశెట్టి కృష్ణ, భట్టిప్రోలు శ్రీనివాస్, సుందర కుమార్, శ్రీను, వెంకట రమణ, నాగేశ్వరావు, కరుణాకర్ తదితరులు పాల్గొని ఘన నివాళులు అర్పించారు.

