
పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు…
నవతరం, భీమవరం: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ఈనెల 14న విప్పటం గ్రామంలో జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభలో అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారని జనసైనికులు, వీర మహిళలు స్వచ్చందంగా పెద్ద సంఖ్యలో హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు పార్టీ జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నీతివంతమైన పాలన అందించిన దివంగత నేత దామోదరం సంజీవయ్య పేరుతో వేదికను ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, అమరావతి రైతులు ధైర్యంగా ముందుకొచ్చి ఆవిర్భావ సభకు భూములు ఇచ్చారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం పై ప్రజలు విరక్తి చూపుతున్నారని రానున్న కాలంలో జనసేన పార్టీ కీలక పాత్ర పోషించనుందని జనసైనికులు వీర మహిళలు సన్నద్ధం కావాలని ఆయన పిలుపు నిచ్చారు.

