పలాస జిల్లాను చేస్తామంటూ చివరికి తప్పించడం అన్యాయం…..!..

0
31

పాత 12 జిల్లాలను 27 జిల్లాలుగా చేసేటప్పుడు పలాసను ఎందుకు విస్మరించారు……? పలాస జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తేనే స్వాతంత్ర్య ఫలాలు సిద్ధిస్తాయి…..!..

ఇదేనా సమాన అభివృద్ధి? పాలకుల వివక్షత వల్లే ఉద్దానం వెనుకబాటు తనం…..!.. వలసల నివారణకు సాగునీటి వనరుల కోసం వంశధార జలాలు అందివ్వాలి…….!.. పలాస జిల్లా కేంద్రాన్ని విస్మరించడంపట్లరానున్న ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పడం తథ్యం…..!..

అభివృద్ధి ఫలాలు వెనుకబడిన ప్రాంతానికి అందాలంటే.. పలాస జిల్లా కేంద్రంగా ఏర్పాటు అనివార్యం……!.. ప్రజల ఆకాంక్షలు తీరే వరకు పోరాటం కొనసాగిస్తాం…..!.. పలాస జిల్లా సాధన కమిటీ కన్వీనర్ దువ్వాడ శ్రీధర్ (బాబా) పలాస జిల్లాను చేస్తామంటూ చివరికి తప్పించడం అన్యాయం…..!..

నవతరం, పలాస: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పేరుతో పాత 12 జిల్లాలను 27 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరణ లో భాగంగా కూటమి ప్రభుత్వం పలాస జిల్లాను ఏర్పాటు చేస్తామని చెప్పి, చివరి క్షణంలో తప్పించడం.. ఘోరమైన అన్యాయమని ప్రముఖ సామాజికవేత్త,న్యాయవాది,పలాస జిల్లా సాధన కమిటీ కన్వీనర్ దువ్వాడ శ్రీధర్ ( బాబా) ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం పలాసలో ఆయన స్వగృహం నందు మీడియాతో మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం సిద్ధించి ఏడు దశాబ్దాలు గడిచినప్పటికీ, రాజ్యాంగం ప్రసాదించిన అభివృద్ధి ఫలాలు సమానంగా అందించవలసి ఉండగా శ్రీకాకుళం జిల్లాలో నాలుగు నియోజకవర్గాలుతీవ్ర నిర్లక్ష్యానికి గురైనాయని, అందువల్ల ఉద్దానంతోపాటు పాతపట్నం, టెక్కలి నియోజకవర్గాలు అభివృద్ధిలో వెనుకబడ్డాయని, అందువల్ల ఈ ప్రాంతం వలసల అడ్డాగా ముద్రపడ్డాయని దువ్వాడ శ్రీధర్ (బాబా) ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణవల్ల ఆయా ప్రాంత ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు లభించడం వల్ల అధిక ప్రయోజనాలకు కలుగుతాయని, ఒక్క శ్రీకాకుళం జిల్లా విషయంలో మాత్రం కొన్ని నియోజకవర్గాలు పూర్తిస్థాయిలో సమానమైన నిధులు వాటా పొందలేకపోవడం వల్ల అభివృద్ధి కుంటుపడుతుందని ఆయన వివరించారు. పెరుగుతున్న జనాభా అవసరాలకు తగ్గట్టుగా జనాభా దామాషా పద్ధతిలో నిధులు కేటాయింపులు ఉండాలని, అయితే శ్రీకాకుళంజిల్లాకు చెందిన ఇచ్చాపురం నియోజకవర్గం రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతమని, అక్కడ ప్రజానీకం వైద్య, ఆరోగ్య అవసరాల కోసం గానీ ఇతర కీలక పనులు నిమిత్తం శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి రావాలంటే దాదాపు 130 కిలోమీటర్ల వరకు ఇబ్బందికరమైన ప్రయాణం చేయవలసిన పరిస్థితి కొనసాగుతుందన్నారు. వాస్తవానికి ఈ ప్రాంతంలో ఎటువంటి భారీ పరిశ్రమలు లేవని, వంశిధార నదీ జలాలు ఇచ్చాపురం వరకు తరలిస్తే, ఇక్కడ వ్యవసాయం సస్యశ్యామలమవుతుందన్నారు. మూలపేట ఓడరేవు అందుబాటులోకి వస్తే పలాస కేంద్ర బిందువుగా మారడం వల్ల, అనేక పరిశ్రమలు వస్తాయని, అదేవిధంగా స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, వ్యవసాయ రంగం కూడా అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నో దశాబ్దాలు నుండి ఈ ప్రాంతం నిర్లక్ష్యం చేయబడిందని, అయినప్పటికీ పలాస కేంద్రంలో జీడి పరిశ్రమ స్వతహాగా నిడదొక్కోవడం వల్ల అంతర్జాతీయ స్థాయిలో పలాస జీడిపప్పుకు మంచి గుర్తింపు ఉందని, ఈ పరిశ్రమ ద్వారా సుమారు 30000 మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారని ఆయన గుర్తు చేశారు. ఎన్నో దశాబ్దాల నుంచి ఈ ప్రాంత అభివృద్ధిపై కొందరు పాలకులు నిర్లక్ష్యం చేయడం వల్ల రాష్ట్రంలో మిగతా ప్రాంతాల అభివృద్ధి కంటే వెనకబడిపోవడానికి కొందరు పాలకులు చేసిన అన్యాయమే నన్నారు. జాతీయ రహదారి, రైల్వే లైను, సముద్ర తీరం, పరిశ్రమలు నెలకొల్పోయినందుకు మరికొన్ని బీడు భూములు, ప్రభుత్వ బంజరు భూములు ఉన్నాయన్నారు. ఇప్పుడిప్పుడే పలాస పట్టణీకరణ దిశగా ప్రయాణం చేస్తుందన్నారు. ఈ నేపథ్యంలో పాతపట్నం, టెక్కలి, ఇచ్చాపురం నియోజకవర్గాలతో పాటు పలాస నియోజకవర్గం కలిపి జిల్లాను ఏర్పాటు చేస్తే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన నిధులు వాటాఈ ప్రజానీకం అవసరాలకు ఉపయోగపడటం వల్ల, ఇక్కడ ప్రజానీకం జీవన ప్రమాణాలు ఎంతో మెరుగుపడతాయని, ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వం గుర్తించి, యుద్ధ ప్రాతిపదికన పలాసను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని దువ్వాడ శ్రీధర్ (బాబా) డిమాండ్ చేశారు. ఏ ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో శాశ్వతం కాదని, చేసిన అభివృద్ధి పనులే మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు తీర్పునిస్తుంటారని, అలా కాదని పలాస ప్రాంత ప్రజలకు అన్యాయం చేసిన పాలకులకు వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పక మునుపే.. మేల్కొని ఉద్దానం ప్రాంత ప్రజల ఆకాంక్షలకు తగిన విధంగా గుర్తించి తక్షణం పలాస జిల్లాను ప్రకటించాలని, లేకపోతే ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని దువ్వాడ శ్రీధర్ (బాబా) హెచ్చరించారు. ఆశిద్దాం ప్రజల ఆలోచనలకు ఆశయాలకు అనుగుణంగా నేటి జిల్లాల విభజనలో భాగముగా అత్యంత ఆవశ్యకమైన నాలుగు నియోజకవర్గాల ప్రజల అవసరాలకు ఆవశ్యకమైన పలాసను జిల్లా కేంద్రముగా ప్రకటిస్తారని.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here