నూతన పెన్షన్స్ ఇవ్వకుంటే ఉద్యమం చేయవలసి వస్తుంది..

0
5


వైస్సార్సీపి మాజీ అన్నవరం దేవస్థానం పాలకమండలి సభ్యులు, దలే చిట్టిబాబు

నవతరం, ప్రత్తిపాడు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికి సుమారు 20 నెలల కాలం పూర్తయి నప్పటికీ ఇప్పటి వరకూ ఒక్క కొత్త పెన్షన్ మంజూరు చేయక పోవడం అత్యంత దుర దృష్టకరం. ఇది ప్రజావ్యతిరేక చర్యగా భావించాల్సివస్తోందని కాకినాడ జిల్లా వైస్సార్సీపీ ఆర్గనైజేషన్ సెక్రటరీ దలే చిట్టిబాబు వ్యాఖ్యానించారు. రాష్టంలో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు అర్హులైన వర్గాలకు పెన్షన్ పై ఆధారపడి జీవించాల్సిన వారు కొత్త పెన్షన్లు మంజూరు కాకపోవడం వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. బీద, మధ్య తరగతి కుటుంబాలు జీవన వ్యయం రోజు రోజుకు పెరుగుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వ వారి పట్ల నిర్లక్ష్యం వైఖరి అలంబించడం వల్ల పేద ప్రజలు కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని దుస్థితికి చేరుకున్నారని ఆందోళన వ్యక్తం చేసారు. పెన్షన్ అనేది దయాదాక్షిణ్యం కాదు, అర్హులైన పౌరుల హక్కు అని అన్నారు. ప్రభుత్వానికి ప్రజల సంక్షేమం పట్ల బాధ్యతగా ఉండాల్సిందేనని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ ఇప్పటి వరకు ఈ అంశంపై స్పష్టమైన చర్యలు లేకపోవడం రాష్ట్ర ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తోందన్నారు. అందుచేత రాష్ట్రంలోని అన్ని జిల్లాల యంత్రాంగం వెంటనే స్పందించి, అర్హులైన వారికి కొత్త పెన్షన్లు మంజూరు చేసేందుకు కృషి చేయాలని హితవుపలికారు. రాష్ట్రము పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి అర్హుడికి న్యాయం చేయాలని పెన్షన్ మంజూరులో జరుగుతున్న ఆలస్యానికి కారణాలు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించాలని ఆయన డిమాండ్ చేసారు. దీనిపై ప్రభుత్వం స్పందించకపోతే, వైస్సార్ సిపి తరఫున ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన కార్యమాలు చేపట్టాల్సి వస్తుందని, అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలతో కలిసి పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజల కష్టాలను దృష్టిలో ఉంచుకొని తక్షణమే ప్రభుత్వం సానుకూలమైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here