నవతరం, ప్రత్తిపాడు: ఎక్కడైనా కరెంటు పోవడం పాపం కరెంటు ఆఫీస్ కి ఫోన్లు కాలీ లేకుండా చేస్తారు. అలాంటిది ప్రత్తిపాడు మండలం
ఉత్తరకంచి సబ్ స్టేషన్ కి గత 7 సంవత్సరాల కాలంలో శాంతి ఆశ్రమం ఫీడర్ సుమారు 60 కీలోమీటర్ల మేర కొండల్లో ఉన్న లైనుకి రాత్రి పగలు ఓరుమని వాన కురుస్తున్న లెక్క చేయకుండా కరెంటు పోయింది అని పోతులూరు గ్రామస్తులు ఫోన్ చేసే అవకాశం ఇవ్వకుండా సర్వీస్ చేసిన పోతులూరు లైన్ మెన్ ను రాజకీయంగా కావాలని కొంతమంది స్వార్ధపరులు పెట్టిన బాధలకు విసుగు చెంది గ్రామంలో కొంతమందికి ఇష్టం లేదు. కనుక మరోక గ్రామానికి ట్రాన్స్ఫర్ పెట్టుకుని వెళ్ళిపోవాలని నిచ్చయించుకున్నాడు. కారణం లేకపోలేదు, తన ఇంటి పేరుతో ఉన్న వ్యక్తి వరుసకు అన్న అయిన వారు గ్రామంలో సర్పంచ్ గా పోటీ చేశాడని కొంతమంది పగ పెంచుకున్నారు.
పుట్టిన గ్రామంలో నిస్వార్థంగా సేవచేయ్యాలని ఉద్దేశంతో వచ్చిన వ్యక్తిని తన పని తాను చేసుకోకుండా అడ్డుపడడమే కాకుండా గ్రామంలో ఉంచకూడదని పై స్థాయిలో ఒత్తుళ్ళు రావడం వలన గ్రామం నుంచి వెళుతున్నట్లు గ్రహించిన గ్రామస్తులు, గ్రామం విడిచి వేరే గ్రామానికి వెళ్లి పోవడాన్ని ఇష్టపడని అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామానికి ఎలాంటి వ్యక్తి లైన్ మెన్ గా వస్తాడో ఈ అడవిల్లోంచి ఉన్న లైనులో ఎక్కడ ఇబ్బంది వచ్చినా వెళ్ళి పోయిన లైన్ మెన్ లా చేస్తారా? అనే భావన గ్రామస్తులలో ఉంది. రాజకీయ నాయకులు వారి స్వార్థ ప్రయోజనాల వలన నీజాయితీగా పని చేసే ఉద్యోగస్తుల సేవలు ప్రజలకు అందుకుండా చేస్తున్నారనే భావన గ్రామస్తులలో నెలకొంది.

