ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్…

0
402

నవతరం, ఎంవిపి కాలనీ: నగరంలోని పెందుర్తి, ఎయిర్‌పోర్టు, గోపాలపట్నం, భీమిలి, గాజువాక, మల్కాపురం, ఇతర పోలీస్‌ స్టేషన్లు పరిధిలో 33 ద్విచక్ర వాహనాల చోరీ నిందితులను అరెస్టు చేసినట్లు నగర పోలీసు కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హా తెలిపారు. శుక్రవారం కమిషనరేట్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాన నిందితుడు మారోతు ఎర్రినాయుడు(34)తో పాటు మరో ఇద్దరు మైనార్‌ నిందితులను పెందుర్తి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. వారి వద్ద నుండి 33 ద్విచక్రవాహనాలను, 20 దొంగ తాళం చెవులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వీటి విలువ సుమారు రూ.13 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. క్రైం డిసిపి వి.సురేష్‌బాబు, ఎసిపి సిహెచ్‌.పెంటారావు, వెస్ట్‌ డివిజన్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.లూథర్‌బాబు, పెందుర్తి ఎస్‌ఐ రాధాకృష్ణ ఈ కేసును దర్యాప్తు చేసినట్లు చెప్పారు.