
నవతరం, హైదరాబాద్: దైవ లీల… దోమల గోల..!(దోమల దండయాత్ర… హాస్య కవిత)
మొన్న… ఒక దోమ నా ముక్కును ముద్దాడే కోపంతో కొట్టా…ముక్కు పచ్చడైపోయె దోమ దొరలా తప్పించుకుపోయే…
నిన్న… ఒక దోమ నా చెంపపై వయ్యారంగా వాలే చెంపను ఒక్కసారి చెల్లుమనిపించా దొంగ దోమ కొంగలా ఎగిరిపోయే…
నేడు… నా వీపుపై ఒక దోమ వీరవిహారం చేస్తూనే వీక్షించిలేని చోట ధైర్యంగా వాలింది తేనెలా నా రక్తాన్ని త్రాగింది రాణిలా రాజ్యమేలింది…
నేను వీపును చూడలేకకుట్టే ఆ దోమను కొట్టలేక జుట్టు పీక్కుంటూ… గిలగిల కొట్టుకుంటూ… నేనొక జీవ జిమ్నాస్ట్ నయ్యా…
ఓరి భగవంతుడా…! నేను బాహుబలినను కున్నానా చేతిలో వజ్రాయుధాలున్నా ఈ సూక్ష్మ శత్రువును జయించలేక బలహీనుడిని… శక్తిహీనుడినైపోయా…
దోమలు నా రక్త ఖజానాను బ్యాంకులో దొంగల్లా దోచేస్తుంటే… నిస్సహాయ ఖాతాదారుడినై నిలుచున్నా..
ఓ దైవమా..! దోమలకెందుకుమా రక్తమే విందు భోజనమాయె… ఆరగించాక… వాటి ఆకలి తీరాక అఅఅతఏఅఅవ్యాధులే మాకు బహుమతులాయే.. ఓ దైవమా..! ఏమిటయ్యా నీ లీల..? తప్పించుకునేదెలా ఈ దోమల గోల..?
వినిపించే నాకు దివినుండి ఓ దివ్యవాణి “భక్తా…భయపడకురా””పిట్టలెన్ని త్రాగినా” సముద్రం ఎండిపోదురా...”దోమలెన్ని కుట్టినా” నీలో రక్తం తరగదురా…”
ఓ భక్తా జాగ్రత్త… రక్తదాతగా నీకు పరలోకంలో ముక్తి ప్రాప్తించేనురా..! కానీ ఈలోకాన మస్కిటో నెట్లు ఆల్ ఔట్లే ఆయుధాలుగా దోమలతో వ్యాధులతో నీవు నిత్యం పోరాడక తప్పదురా తెలివిగా.
రచన:కవ రత్నసాహిత్య ధీరసహస్ర కవి భూషణ్ పోలయ్య కూకట్లపల్లి అత్తాపూర్ హైదరాబాద్

