
నవతరం కరప : విశాఖపట్నంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, రాష్ట్ర PAC సభ్యులు పంతం నానాజీ, మరియు జనసేనా రాష్ట్ర నాయకులు, ఇంచార్జ్లపై పెట్టిన కేసులు బేషరతుగా ఎత్తివేయాలని, అక్రమంగా అరెస్టులు చేసిన వారిని బేషరుతుగా విడుదల చేయాలని కోరుతూ కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలంలో జనసేన నాయకులు ధర్నా నిర్వహించారు. సీనియర్ జనసేన నాయకులు బోగిరెడ్డి కొండబాబు ఆధ్వర్యంలో నిరసన చేపట్టి జనసేన నాయకుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ పోలీస్ అధికారి వారికీ, రెవెన్యూ అధికారి వారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు, కరప మండల నాయకులు, గ్రామ కమిటీ నాయకులు, జనసైనికులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

