
అదే రోజున కాపులపై దాడులెందుకు…
గతంలో ముద్రగడ… నేడు అంబటి.
నవతరం, ఆంధ్రప్రదేశ్ : చంద్రబాబు అధికారంలోకి వచ్చిన రెండో సంవత్సరంలో వచ్చిన జనవరి 31కి ఒక రచ్చ చేయించాలని తన బుర్రలో ఎదో పురుగు గొలుకుతుందేమోననే అనుమానం కలుగుతుంది. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2016 జనవరి 31 నాడు ప్రశాంతంగా సభ నిర్వహించుకుంటున్న కాపుల సభలో కొంతమందిని గుండాలను పంపి ప్రశాంతంగా జరుపుకుంటున్న సభను విధ్వంసం చేసే కుట్రకు తెర లేపారు. 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 2026 జనవరి 31 నాడే నాడు గొలికిన పురుగే మళ్లీ బుర్రలో గోలికినట్టుంది. కనుకనే అంబటి రాంబాబు ప్రశాంతంగా చంద్రబాబు చేసిన నెయ్యిలో కల్తీ కలిసిందని అబద్ధపు ప్రచారం చేసిన చంద్రబాబు వ్యాఖ్యలు తప్పని సిబిఐ తేల్చడంతో వైఎస్ఆర్సిపి నాయకులు ప్రశాంతంగా దేవుడి గుడులకు వెళ్లి పూజలు చేసుకుంటున్నారు. ఇది చూసిన చంద్రబాబుకు నా కుట్రకు భగ్నం కలిగిందని భావించిన
బాబు ప్రశాంతంగా రాంబాబు వాహనాలపై టిడిపి మూకలు కర్రలు రాడ్లతో దాడికి పాల్పడ్డారు రాంబాబుని చంపాలని పథకం రచించినట్లు కనిపిస్తుంది. అయితే నాడు ముద్రగడను కూడా ఇదే విధంగా చంపాలని చంద్రబాబు కుట్ర పన్నినా అది నెరవేరలేదు. చంద్రబాబుకి కాపులపై ఎప్పుడు ఓ రకమైన ద్వేషం, పగ ఉంటుందని చెప్పక తప్పదు. గతంలో కాపులు ఆరాధ్యదైవంగా కొలిచే వంగవీటి రంగాను పొట్టన పెట్టుకున్నారు. రంగా హత్య కుట్రకు చంద్రబాబు తెర లేపారని ఆ సమయంలో హోం మంత్రిగా పనిచేసిన హరి రామ జోగయ్య సైతం పలు సందర్భాల్లో మీడియా వేదిక మాట్లడడం చూశాం. తర్వాత కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇవ్వడం ఇచ్చిన హామీని గాలికి వదిలేశారని ముద్రగడ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ముద్రగడను చంపాలని చూడడమే కాకుండా, వివాదాలకు దూరంగా ఉండే ముద్రగడ కుటుంబ సభ్యులను పోలీసుల లాటీలతో కొట్టించడం జరిగింది. ఇప్పుడు మాజీమంత్రి తదుపరి అంబటి రాంబాబును ఇలా కాపులలో కాస్త గట్టిగా మాట్లాడే వాళ్ళని ఉంచకూడదని భవన్లో చంద్రబాబు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఒక పక్క కాపుల వలనే అధికారం అనుభవిస్తున్న చంద్రబాబుకు ఇంకెంత కాలం కాపులపై పగతో రగిలిపోతారో చూడాలి. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ కు జ్జానోదయం అవుతుందా? కాపులపై జరుగుతున్న దాడులపై మూగబోయిన పవన్ నోరు ఇప్పటికైనా లేస్తుందా? కమ్మ వారికి కాపాలాకేనా పవన్ అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ
ఉద్దేశం ఏదైనా కావచ్చు అంబటి రాంబాబు దూషించడం కరెక్ట్ కాదు. ఒక ప్రజా ప్రతినిధి ఇలా మాట్లాడి ఉండకూడదు. కానీ ఈరోజు అంబటి రాంబాబు దూషించడం కరెక్ట్ కాదని చెప్పేముందు నేడు స్పీకర్ గా ఉన్న అయ్యన్నపాత్రుడు ఒక సభ వేదికగా జగన్ ఇదే విధంగా, ఇదే పద జాలంతో దూషించడం జరిగింది. దానికి వైసిపి అధికారంలో ఉండగా ఎలాంటి వివాదం తీసుకురాలేదు. ఇలాంటి పదాలతో ఎంతోమంది టిడిపి అనుచరులు, అధికార ప్రతినిధులు జగన్ దూషించారు. ఇప్పటికైనా ప్రజా జీవితంలో ఉన్న ప్రజా ప్రతినిధులు నోరు జారుతుంటే సమాజానికి తప్పుడు సంకేతాలు వెళతాయనే చెప్పాలి. అధికారంలో ఉన్న పార్టీ నాయుకులు అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా, ప్రతిపక్షలను అనిచివేయకుండా వారి విధి వారు నేరవేర్చేలా సహకరిస్తూ, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

