
నవతరం, అంబాజీపేట: కోనసీమకు చెందిన ఉపాధ్యాయుడు మామిడిశెట్టి బాలాజీ రచించిన ప్రత్యేక గీతాన్ని ఈరోజు జగ్గన్నతోటలో పి గన్నవరం శాసనసభ్యులు గడ్డి సత్యనారాయణ ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏకాదశ రుద్రుల ప్రభల తీర్థం నిర్వహించే 11 గ్రామాల పెద్దలు పాల్గొన్నారు. గీత రచయిత మామిడిశెట్టి బాలాజీని గ్రామల పెద్దలందరూ అభినందించారు. ఈ కార్యక్రమంలో మట్టపర్తి సూర్యప్రకాశరావు, సిరిగినీడి వెంకటేశ్వరరావు, మైపాల తాతాజీ, నాగాబత్తుల వెంకట సుబ్బారావు, గణపతి వీర రాఘవులు, మట్టపర్తి చంద్రశేఖర్, వీరిన గోపాలం మొదలైన వారు పాల్గొన్నారు.

