
నవతరం, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసంలో గోశాల ఏర్పాటు చేశారు. తిరుపతి నుంచి 6 గోవులను ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి తీసుకొచ్చారు. ఆ గోవులకు జగన్ సతీమణి వైఎస్ భారతి పూజచేసి గోశాలకు తరలించినట్టు అనధికారిక సమాచారం. అయితే.. సడన్‌గా గోశాల ఏర్పాటుపై వైసీపీ నాయకుల్లో, ప్రభుత్వ వర్గాల్లోనూ జగన్ హిందూ కాదు అనే వారిలోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి ఇంతవరకూ ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.

