అంతర్జాతీయంగా గుర్తింపు పొంది, కాపులకు వెన్నుముక కోనసీమకు అంబేడ్కర్ పేరు అవసరమా..?
కాపులు ఏడు దశాబ్దాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రత్తిపాడును BC లకు కేటాయించే ప్రయత్నం సమంజసమా..?
నవతరం, ప్రత్తిపాడు: రాష్ట్ర జనాభాలో నాల్గవ వంతు ఉన్న కాపు సామాజిక వర్గానికి న్యాయం జరగడం లేదు. గత రెండు దశాబ్దాలుగా వైయస్ కుటుంబానికి ఎన్నుదన్నుగా ఉన్న కాపు ( తెలుగు, బలిజ, వంటరి) సామాజిక వర్గాలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి అంచెలంచెలుగా ప్రాధాన్యతను తగ్గిస్తూ ఉత్తరాంధ్రలోను పూర్తిగాను ఇటివల ఉభయగోదావరి జిల్లాల్లో కూడా కాపులను అనగదోక్కే పక్రియ కోనసాగుతుంది. దానికి కారణం ఒకరిద్దరు సలహాదారులా లేక జగన్మోహన్ రెడ్డి నిర్ణయమో తెలియదు కానీ ప్రజాస్వామ్య బద్ధంగా జనాభా తమాషా పద్దతిలో కాపు కులస్తులకు ఏ రంగంలోనూ న్యాయం జరగలేదన్నది జగమోరిగిన సత్యం. కేవలం సినీ అబిమానంతో కొంతమంది యువకులు పవన్ కల్యాణ్ కి జై కొట్టినంత మాత్రాన వైసిపి కి ఓట్లు వెయ్యలేదన్నది తప్పుడు నిర్ణయం ఈ మూడేళ్లలో జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ 80% సీట్లు సంపాదిస్తుంది అంటే కాపు కులం పూర్తిగా వ్యతిరేకిస్తే అది సాధ్యమా. కేవలం కొన్ని కులాలు మాత్రమే ఉంటే సరిపోతుందని అనుకుంటే అది రాజకీయ పరిపక్వతలేని తనమా? లేక మొండితనమా? ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యుడు బలహీనత కారణమా? లేక మరో రాజకీయ కోనము ఉందా? ఏదిఏమైనా ఇటువంటి తొందరపాటు నిర్ణాయాలతో రాజకీయాల్లో శాశ్వతంగా కొనసాగలరా? సామాజిక వర్గానికి న్యాయం కోసం గత మూడు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న నాయుకుడి నియోజకవర్గాన్నే అసామాజిక వర్గానికి ప్రాతినిధ్యమే లేకుండా చేయడము న్యాయమేనా? జనాభా ప్రాతిపదికన ఇప్పటికే రిజర్వేషన్ పేరుతో అన్ని రంగాలలోను ఏడు దశాబ్దాలుగా నష్టపోయి ఉసూరు మంటున్న సామాజిక వర్గానికి చెందిన స్థానాన్ని దూరం చేయడమే సంక్షేమ రాజ్యమా? కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసం అందరి హక్కులను కాలరాయడం తగదని రాజకీయ విశ్లేషకులు, ప్రముఖుల అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తూ ఇటువంటి తొందర పాటు చర్యలు మూడు దశాబ్దాల పాటు తానే ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించాలని అబిప్రాయపడిన జగన్మోహన్ రెడ్డి కి తగునా ఇప్పటికైనా వైకాపా ప్రభుత్వం ప్రదాన నిర్ణయాలు తీసుకునే ముందు అన్ని విషయాలు కులకుషంగా చర్చించి ప్రాంతీయ అసమానతలు తలెత్తకుండా చూసుకుని నిర్ణయాలు తీసుకుంటారని ఆశిద్దాం.

