చింతలూరు ఆయుర్వేద గోడౌన్ చోరీ కేసులో నిందితుడికి ఏడాది కఠిన కారాగార శిక్ష… సీఐ విద్యాసాగర్, ఎస్ ఐ నరేష్

0
7



నవతరం, రావులపాలెం: డా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజక వర్గం ఆలమూరు మండలం చింతలూరు శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదం గోడౌన్‌లో జరిగిన భారీ చోరీ కేసులో నిందితుడికి కోర్టు కఠిన శిక్ష విధించింది. 2022 జనవరి 12 అర్ధరాత్రి సమయంలో గోడౌన్‌లోకి చొరబడిన సంగడి శ్రీనివాస్ (58) విలువైన ఆయుర్వేద వస్తువులను అపహరించినట్లు నిర్ధారణ కావడంతో, ఆలమూరు జె.ఎఫ్.సి.ఎం (J.F.C.M) కోర్టు న్యాయమూర్తి ఐ. ప్రవీణ్ కుమార్ నిందితుడికి ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5,000 జరిమానా విధిస్తూ బుధవారం తీర్పు వెలువరించారు. ఈ కేసులో అప్పటి ఆలమూరు ఎస్.ఐ. ఎస్. శివప్రసాద్ Cr.No: 35/2022 u/s 380, 411 IPC కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. దర్యాప్తులో గోడౌన్ నుండి 10 కిలోల లవంగాలు, 15 కిలోల కొబ్బరి నూనె, 250 కిలోల పంచదార, 15 కిలోల నువ్వుల నూనె, 12 కిలోల జీలకర్ర దొంగిలించినట్లు పోలీసులు గుర్తించారు. ప్రభుత్వ తరపున ఏ.పి.పి శ్రీరాములు వాదనలు వినిపించగా, కోర్టు కానిస్టేబుల్ (PC 3374) కె. దుర్గా ఈశ్వర్ కీలకంగా సహకరించారు. కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసి నిందితుడికి శిక్ష పడేలా చేసిన అధికారులను ఆలమూరు ఎస్.ఐ. జి. నరేష్ రావులపాలెం రూరల్ సి.ఐ. విద్యాసాగర్ అభినందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here