

నవతరం, ఏలేశ్వరం: లింగంపర్తి గ్రామంలో వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముద్రగడ గిరిబాబు దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి జగన్మోహన్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేసారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసారు. కార్యకర్తలు, నాయకులు సమక్షంలో తన అభిమాన నాయకుడుపై ఉన్న ప్రేమను చాటుకున్నారు .
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పాలనలో పేద ,బడుగు బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో ముందు ఉండేవారని విద్యా, వైద్యానికి ప్రాధాన్యత కల్పిస్తూ రాష్ట్రం ఎంతో సుభిక్షంగా ఉండేదన్నారు . ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలన అస్తవ్యస్థంగా ఉందన్నారు. అందువల్ల మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి పాలన కోసం ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నారని త్వరలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు తగిన గుణపాటం చెపుతారని ఆశాభావం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ పరిధిలో రాష్ట్ర పార్టీ కార్యదర్శులు, మండల పార్టీ అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, జిల్లా, నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా, మండల కమిటీల సభ్యులు, సోషల్ మీడియా కార్యకర్తలు, మహిళా ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు స్థానిక ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు, వైసిపి కార్య కర్తలు ప్రజలు పాల్గొని తమ నాయకునికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

