మునుగోడు, అక్టోబర్ 16(నవతరం): నాలుగు నెలల క్రితం బ్రహ్మణపల్లి గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తమ మాట వినలేదని స్వప్నను గ్రామ బహిష్కరణ చేస్తూ చాటింపు వేయించారు. కిరాణా షాపు నడుపుకుంటున్న బాధితురాలి దుకాణంలో ఎవరూ సామాన్లు కొనుగోలు చేయకూడదని, చేస్తే రెండు వేలు జరిమానా కట్టాల్సి ఉంటుందని ప్రకటించారు. దీంతో నాలుగు నెలలుగా తన కిరాణ షాపుకు గ్రామస్తులు రాకపోగా తమ పిల్లలు స్కూల్‌లోకి అనుమతించడం లేదని బాధితురాలు తెలిపారు. ఇదే విషయాన్ని అధికారులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోకపోవడంతో వారిపై కోపంతోనే ఇప్పుడు మునుగోడు ఎన్నికల్లో నామినేషన్ వేశానని బాధితురాలు వాపోయింది.

గ్రామ బహిష్కరణ చేశారని.. ఎమ్మెల్యేగా పోటీ