క్యాట్ ఒలంపియాడ్ లో ప్రతిభ కనబర్చిన చైతన్య విద్యార్థుల …

0
135

నవతరం, రావులపాలెం:

ఇటీవల జాతీయ స్థాయిలో నిర్వహించిన క్యాట్ ఒలంపియాడ్ నందు తమ పాఠశాలకు చెందిన విద్యార్థులు అత్యధిక ప్రతిభ కనబర్చినట్లు శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ జగదీష్ తెలిపారు.ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమానికి మండపేట రీజినల్ ఇంచార్జ్ నరేష్, ఎకడమిక్ కోఆర్డినేటర్ కిరణ్ పాండే ముఖ్య అతిధులుగా విచ్చేశారు.ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ పరీక్షలో మొత్తం 202 మంది విద్యార్థులు పాల్గొనగా 55 మంది రెండోదశ పరీక్షకు ఎంపికయ్యారన్నారు. జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చిడానికి కారణం తమ పాఠశాలలో నిర్వహించే పూర్తిస్థాయి ఐఐటీ శిక్షణ కారణమన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ అప్పారెడ్డి, డిన్ కేశవరావు, ఇన్చార్జి మూర్తి,సతీష్, విద్యార్థులు పాల్గొన్నారు.