కాకినాడ జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న వేట్లపాలెం క్షతగాత్రలకు వైయస్ఆర్ సీపీ పరామర్శ…

0
180

బర్నింగ్ వార్డులో క్షతగాత్రులను పరామర్శించిన ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి, దవులూరి..



నవతరం, కాకినాడ: వేట్లపాలెం ఘటన దురదృష్టకరం. భాధితులకు అధికారులు, ప్రభుత్వం చేస్తున్న సహాయ చర్యలకు తోడ్పాటుగా ఉండాలని మాజీ సీఎం వైయస్ జగన్ మమ్మల్ని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు వైయస్ఆర్ సీపీ అండగా ఉంటుంది. వేట్లపాలెం లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ఒక పాలసీని తీసుకురావాలి. గత వైయస్ఆర్ సీపీ పాలనలో పరిశ్రమల్లో ప్రమాదాల నిరోధానికి సేప్టీ ఆడిట్ ను మాజీ సీఎం వైయస్ జగన్ తీసుకువచ్చారు. నిరంతరం ప్రమాదకర పరిశ్రమల్లో సేప్టీ ఆడిట్ జరపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. పీరియాడికల్ గా సేఫ్టీ ఆడిట్ చేసేట్టు ప్రభుత్వం విధానాలు రూపొందించాలి. సంబధిత అధికారులకి స్పష్టమైన విధి విధానాలు ఇవ్వాలి, క్షతగాత్రులకు ప్రభుత్వం మెరుగైన వైద్య సహాయం అందించాలి, ఖర్చు ఎంతైనా భరించాలి, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here