
నవతరం, కాకినాడ: కాకినాడ నగరంలో స్థానిక రామారావు పేటలో గాంధీ బొమ్మ సెంటర్లో ఉన్న వర్ణిక ఫంక్షన్ హాల్ నందు సిపిఐ వారి అధ్వర్యంలో వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీని మద్దతు తెలపాల్సిందిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాదేపల్లి సత్యానందరావు మద్దతును తెలపాల్సిందిగా ఆహ్వానించడమైనది. దీంతో ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేపట్టిన నిరంకుశ ధోరణి వైద్య వృత్తిని చిన్న భిన్నం చేస్తుందన్నారు. వైద్య కళాశాలలను ప్రైవేటీ కరణం చేయడం వల్ల కార్పొరేట్ వ్యక్తులకు కాసుల వర్షం కురిపిస్తుందే తప్ప పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వము జారీ చేసిన ఈ జీవోను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వైద్య కళాశాలల ప్రైవేటికరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రివర్యులు కురసాల కన్నబాబు, కాకినాడ మాజీ పార్లమెంటు సభ్యులు వంగా గీత విశ్వనాథ్, కాకినాడ మాజీ మేయర్ సుంకర శివప్రసన్న వైసిపి నాయకులు, సిపిఐ నాయకులు, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, ఐ.ఎన్.టి.యు.సి నాయకులు తాళ్లూరి రాజు, వివిధ ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

