ఒకే రూపం అపురూపం హ్యాపీ హ్యాపీ కవలలు..

0
14


నవతరం, కొత్తపేట: నేడు కవలల దినోత్సవం ఒకే కాన్పులో ఇద్దరూ లేదా ఆపైన పుట్టిన పిల్లలను కవల పిల్లలు అంటారు. కవల పిల్లలను చూడగానే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఒకే రూపంతో ఇద్దరూ అపురూపంగా కనిపిస్తుంటారు.ఇక వీరి మాట రూపు ఆవ భావాలు మనోభావాలు కూడా ఒకే విధంగా ఉంటాయి. ఒకే కాన్పులో ఇద్దరూ లేదా అంతకంటే ఎక్కువ మంది జన్మిస్తే వారిని కవలలు అంటారు. చాలా మందికి ఇద్దరు జన్మనిస్తారు. కానీ అరుదుగా ఇద్దరో ముగ్గురో మాత్రం ముగ్గురు లేదా నలుగురికి జన్మనిచ్చిన సంఘటనలు ఉన్నాయి. ఫిబ్రవరి 22 ను జాతీయ కవలల దినోత్సవంగా జరుపుకుంటారు.దానిని పురస్కరించుకుని కొత్తపేటకు చెందిన గుబ్బల మూర్తి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.మూర్తి ఝాన్సీ దంపతులకు వర్షిని, వర్ధిని కవలలుగా జన్మించారు.కవలల దినోత్సవాన్ని వారు ప్రత్యేకంగా భావించి ఆనందంగా జరుపుకుంటున్నామన్నారు.వర్షిని, వర్ధిని ఒకే రూపంలో ఉండటమే కాదు ఒకే రకమైన హావభావాలను కలిగి ఉంటున్నారాన్నారు. ఇద్దరికీ ఒకేసారి ఆకలి అనారోగ్యం వస్తుంటాయని తల్లిదండ్రులు తెలిపారు. ఒకరికి జ్వరం వచ్చినచో మరొకరికి కూడా ఆ వెంటనే జ్వరం వస్తుందన్నారు. చదువులలోనూ రాణించి వారి ప్రతిభ కనబరుస్తూ వస్తున్నారు. పదవ తరగతి పరీక్షలలో ప్రథమ శ్రేణులో ఉత్తీర్ణులై ప్రస్తుతం షిరిడి సాయి విద్యాలయం ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నారు.అనుకున్న లక్ష్యాలను సాధించి భవిష్యత్తులో మంచి ప్రయోజకులు కాగలరని ఆశిస్తూ కవలలందరికీ హ్యాపీ ట్విన్స్ డే శుభాకాంక్షలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here