రాజన్న సిరిసిల్ల జిల్లా, అక్టోబర్ 19 (నవతరం): వేములవాడ మున్సిపల్ పరిధిలో నిర్మాణంలో ఉన్న రెండు పనుల పదవి కాలం పొడగింపు విషయంలో 30 వేలు లంచం తీసుకుంటూ వేములవాడ మున్సిపల్ కమిషనర్ శ్యాం సుందర్ రావు ఎసిబికి చిక్కారు. పట్టణంలోని భగవంతరావు నగర్ లో రెండు కోట్ల 71 లక్ష రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న వెజిటేబుల్ కూరగాయల మార్కెట్, ఒక కోటి 24 లక్షల వ్యయంతో మండలంలోని తెట్టకుంటలో నిర్మిస్తున్న డంపింగ్ యార్డ్ పనులు చేస్తున్న సుంకరి మహేష్ అనే కాంట్రాక్టర్ నిర్మాణ కాలం పూర్తవడంతో తిరిగి ఈ రెండు పనులకు నిర్మాణ కాలం పొడగించాలని కోరడంతో మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్రావు 30 వేల రూపాయలు డిమాండ్ చేశారు. మహేష్ వద్ద పని చేస్తున్న సత్యం సూపర్వైజర్ తో డబ్బులు ఇస్తున్న సమయంలో ఏ సి బి డి ఎస్ పి భద్రయ్య ఆధ్వర్యంలో కమిషనర్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.కరీంనగర్ ఇంట్లో కూడా సోదాలు చేశాం. కమిషనర్ శ్యాం సుందర్ రావు ను పూర్తిస్థాయి విచారణ చేస్తున్నామని పంచనామ పూర్తయిన తర్వాత ప్రత్యేక కోర్టుకు తరలించనునట్లు డిఎస్పి చెప్పారు.


