
17 న ఉక్కు పరిపాలన భవనం ముట్టడి
నవతరం, విశాఖపట్నం: విశాఖ ఉక్కు పరిశ్రమ 100 శాతం వ్యూహాత్మక అమ్మకానికి అవసరమైన లీగల్ అడ్వైజర్, ట్రాన్జక్షన్ అడ్వైజర్ నియామకం కోసం టెండర్ల ప్రక్రియను ఈనెల 17న ప్రారంభించనున్న నేపథ్యంలో ఆ రోజు ఉక్కు ప్రధాన పరిపాలన భవనం ముట్టడి చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నిర్ణయించింది. శుక్రవారం ఎల్‌ఎంఎంఎం పార్కు వద్ద జరిగిన పోరాట కమిటీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ 17న కేంద్ర ప్రభుత్వానికి భంగం కలిగించే విధంగా ప్రతిఘటన ఉండాలన్నారు. కార్యకర్తల సూచనలకు అనుగుణంగా పోరాటాలను మరింత ఉధృతం చేసేలా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ సమావేశంలో పోరాట కమిటీ నాయకులు జె.అయోధ్యరాం, మంత్రి రాజశేఖర్, గంధం వెంకట్రావు, కె.సత్యనారాయణ రావు, జె సింహాచలం, జె రామకృష్ణ, వై.మస్తానప్ప, గణపతి రెడ్డి, డి సురేష్ బాబు, వరసాల శ్రీనివాస్, మహాలక్ష్మి నాయుడు, జిఆర్‌కె నాయుడు, పరంధామయ్య, నెల్లి అప్పలరాజు, నిర్వాసితుల సంఘం నాయకులు పులి రమణారెడ్డి, ఒప్పంద కార్మిక సంఘం ప్రతినిధులు శ్రీనివాసరాజు, నమ్మి రమణ, అవతారం, మంత్రి రవి వివిధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు

